ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ చేస్తున్న దారుణాలు - పాల్పడుతున్న అరచకాలు అన్నీ ఇన్నీ కాదు. దేశం ఏదైనా - ప్రజలెవరైనా.. దాడి చేయడమే ప్రధాన కర్తవ్యం - మరణాల సంఖ్యను తెలుసుకుని ఆనందించడమే నిత్య కృత్యం. రాక్షసులకు పర్యాయపదాలుగా మారిన ఈ ఉగ్రవాదులకు సంబందించి తాజాగా తెలిసిన ఒక విషయం గగుర్పాటుకు గురిచేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తాజాగా టర్కీలో ఒక బాంబు పేలింది. ఆగ్నేయ టర్కీలోని సిరియా సరిహద్దుకు సమీపంలొగల గజియం టేప్ లో ఆదివారం రాత్రి పెళ్లివేడుక జరుగింది. అత్యంత ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలో ఉన్నట్లుండి పెద్ద బాంబు పేలింది. ఈ బాంబు దాడితో అప్పటివరకూ కళకళలాడిన పెళ్లి మండపం మొత్తం రక్తంతో తడిచిపోయింది. ఇప్పటివరకూ సంగీతంతో హడావిడిగా ఉన్న ప్రాంతం కాస్త హాహాకారాలతో నిండిపోయింది. ఇప్పటివరకూ సుమారు 50మంది దుర్మరణం పాలవగా - వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లివేడుక ప్రాంతం కాస్త... సగం కాలిన మృతదేహాలతో - ముక్కలు ముక్కలుగా పడి ఉన్న శరీర భాగాలతో - రక్తం ఓడుతున్న గాయపడినవారి ఆర్తనాధాలతో నిండిపోయింది. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులేనని టర్కీ అధ్యక్షుడు తయ్యపి ఎర్డోగన్ ప్రకటించారు. ఇదేమీ కొత్త విషయం కాకపోయినా.. దర్యాప్తు అనంతరం వెలువడిన మరో ప్రకటన ప్రపంచం నిర్ఘాంతపోయేలా చేసింది. అదేమిటంటే.. ఈ దాడిలో పాల్గొన్నది ఒక బాలుడు. 12 నుంచి 14 ఏళ్ల వయసున్న బాలుడే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడట. దీంతో ప్రపంచం మొత్తం షాక్ కి గురైంది.
ఉగ్రవాద సంస్థలపై నిఘా సీరియస్ గా కొనసాగుతుండడంతో ఈ మేరకు ఉగ్రవాదులు తమ వ్యూహం మార్చినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. చిన్న పిల్లలపై నిఘా అంతగా ఉండదని - 12 ఏళ్ల వయసున్న బాలురిని ఆదృష్టితో చూడరు అన్న భావనతోనే ఉగ్రవాదులు వారిని పావులుగా వాడుకుంటున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా.. 12 ఏళ్ల వయసు బాలురు సైతం వారి టీం మెంబర్స్ లో ఉన్నారనే వార్త మాత్రం ప్రపంచాన్ని షాక్ కి గురిచేస్తుంది!