మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లుగా ఏపీ ప్రభుత్వ పరిస్దితి ఉంది. అసలే నిధులు లేక కటకటలాడుతోంది. నిధులు సమకూర్చుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోనే ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) జరిమానా విధించింది. పొలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఏకంగా ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ రూ. 120 కోట్లు జరిమానా విధించింది. పర్యావణ అనుమతులు లేకుండా కట్టిన మరో మూడు ప్రాజెక్టులకు కూడా జరిమానా విధించడం గమనార్హం. చింతలపూడి ప్రాజెక్టుకు రూ. 73.6 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు 24.90 కోట్లు, పురుషోత్తమ పట్నంకు రూ. 24.56 కోట్లు జరిమానా విధించారు. ఈ జరిమానాను మూడు నెలల్లో చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. అంతేకాదు జరిమానా నిధుల వినియోగంపై సీపీసీబీ, ఏపీ పీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఆదేశించింది. గతంలో కూడా ఏపీ ప్రభుత్వంపై పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్టీటీకి ఫిర్యాదు చేశారు.
అయితే పట్టిసీమ, చింతలపూడి, పురుషోత్తమపట్నం ఈ మూడు ప్రాజెక్టులు పొలవరంలో భాగమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పోలవరం పూర్తవడానికి ముందే నీటిని పోలవరం కాలువల ద్వారా నీటి పంపించడానికి ప్రాజెక్టులు నిర్మించారు. వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ఎన్టీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మూడు ప్రాజెక్టులు అక్రమని గతంలోనే ఎన్జీటీ తీర్పు చెప్పింది. ఈ మూడు ప్రాజెక్టులు పోలవరంలో భాగంకాదని కేంద్రజలశక్తి శాఖ ఎన్జీటీకి తెలిపింది. ఈ నేపథ్యంలోనే పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్‌జీటీ తేల్చిచెప్పింది.
ఇప్పటికే పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులు పూర్తయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. పురుషోత్తమ పట్నం ఒక్కటే నిర్మాణంలో ఉందని అంటున్నారు. పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులు ఇప్పటికే నిర్వహణలో ఉన్నందున పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ సూచించింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ వాటిని నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించిన విషయం తెలిసిందే. చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని, పర్యావరణ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు చేపట్టాలని ఎన్జీటీ ఆదేశించింది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం ఈ మూడు ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఇవన్నీ గత ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులే.