ఇరాన్ లో నైతిక పోలీస్ విభాగాన్ని రద్దు చేయాలని కోరుతూ యూనివర్సిటీ విద్యార్థులు కొద్దిరోజులుగా నిరనసలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో విద్యార్థులు పలు ఆందోళన కార్యక్రమాలు పిలుపునిచ్చారు. అయితే ఆందోళన తేదికి ఒకరోజు ముందు విద్యార్థులపై విషప్రయోగం జరగడం సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖరాజమీ.. ఆర్క్ విశ్వవిద్యాలయం సహా మర నాలుగు యూనివర్సిటీ విద్యార్థులు నైతిక పోలీస్ విభాగాన్ని రద్దు చేయాలనే నినాదంతో ఇటీవల సమావేశం నిర్వహించుకున్నారు. 1200 మంది విద్యార్థులు పాల్గొని ఆందోళన కార్యక్రమాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆందోళన తేదికి ముందు రోజు రాత్రి యూనివర్సిటీలో ఆహారం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనపై ది నేషనల్ స్టూడెంట్ యూనియన్ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం విష ప్రయోగం చేయడ వల్లే విద్యార్థులు వాంతులు.. విరేచనాలు.. తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారని తెలిపారు. రాత్రి పూట చాలావరకు వైద్య శాలలు మూసి ఉండటంతోపాటు డీహైడ్రేషన్ కు సంబంధించి ఔషధాలు కొరత ఏర్పడడంతో చాలా ఇబ్బందులు పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీలోని కెఫెటేరియాలో తినుబండరాలు తినకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికారులు మాత్రం నీటిలో కలుషిత బ్యాక్టీరియా వల్లే ఇలా జరిగి ఉంటుందని చెబుతున్నారు. అయితే గతంలో తమకు ఎదురైన అనుభవాల దృష్ట్యా అధికారులు ఈ కుట్ర చేసి ఉంటారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఇరాన్ లో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఇరాన్ ప్రాసిక్యూటర్ జాఫర్ మోంటజెరీ నైతిక పోలీస్ విభాగాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో యథావిధిగానే ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా అంతర్జాతీయ రాక్ క్లైంబింగ్ పోటీల్లో హిజాబ్ ధరించకుండా పాల్గొన్న ఇరాన్ క్రీడాకారిణి ఎల్నాజ్ రెకబీ ఇంటిపై అధికారులు దాడి ధ్వంసం చేయడం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
ఇరాన్ లో నైతిక పోలీస్ విభాగాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించిన తెల్లారే ఇరానియన్ వైర్ పత్రికలో ఈ దాడిపై కథనం వెలువడింది. ఎల్నాజ్ ఇంటిపై దాడి సందర్భంగా ఆమె సాధించిన పతకాలను రోడ్లపై పారేసిన దృశ్యాలను ఇరానియన్ వైర్ ప్రముఖంగా ప్రచురించింది. ఈ సంఘటనతో ప్రభుత్వంపై ప్రజల్లో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.