13కోట్ల వజ్రం.. సినీ ఫక్కీలో ఇలా చోరీ

Update: 2019-10-27 10:13 GMT
ధూమ్2 సినిమాలో ఎలాగైతే హీరో అత్యంత విలువైన వజ్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎలా కొట్టేశాడో చూసి మనం అబ్బుర పడ్డాం. అచ్చం అలాగే జపాన్ లోని టోక్కో సమీపంలోని యోకోహామాలో ఏకంగా 13 కోట్ల వజ్రాన్ని దొంగలు చాకచక్యంగా కొట్టేయడం కలకలం రేపింది.

యోకోహామాలో అంతర్జాతీయ నగల ఎగ్జిబిషన్ జరుగుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత 410 నగల సంస్థలు ఈ ప్రదర్శనలో తమ విలువైన ఆభరణాలను ప్రదర్శించాయి. దీంతో జపాన్ ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టంగా ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. సీసీ టీవీలతో అత్యంత భద్రత కల్పించింది.

అయితే ఇంత సెక్యూరిటీలోనూ ఓ గాజు పేటికలో ఉంచిన రూ.13 కోట్ల విలువైన 50 క్యారెట్ల వజ్రం మాయమైంది. ఆ ప్రదర్శన మొత్తానికే అత్యంత విలువైన అందరి  కళ్లు మిరుమిట్లు గొలిపే వజ్రం. దీన్ని దొంగలు అంత్యంత చాకచక్యంగా ధూమ్ 2 సినిమాలో కొట్టేసినట్టు కొట్టేశారు.

వజ్రం దొంగతనం జరిగిన విషయం కూడా ఎవ్వరూ గుర్తించకుండా దొంగలు చేతివాటం ప్రదర్శించారు. వేయికళ్లతో కాపాలా కాసినా ఆ డైమండ్ ఎలా కొట్టేశారన్నది ఎవరికీ అంతుబట్టలేదు. వెంటనే అలెర్ట్ అయిన నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ డైమండ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Tags:    

Similar News