13 అంకెల నంబ‌ర్ సాధార‌ణ సిమ్ ల‌కు కాద‌ట‌!

Update: 2018-02-21 13:18 GMT
త్వ‌ర‌లో మ‌న మొబైల్ ఫోన్ల నెంబ‌ర్లు....10 డిజిట్స్ నుంచి 13 డిజిట్స్ కు చేర‌బోతున్నాయ‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. పాత సిమ్ కార్డుల‌కు 2018, అక్టోబ‌రు 1 నుంచి డిసెంబ‌రు 31లోపు ఈ ప్ర‌క్రియ పూర్తి కాబోతోంద‌ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.  ఈ ప్ర‌కారం టెలికాం ఆపరేటర్లకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం(డీవోటీ) ఆదేశాలు కూడా జారీ చేసింద‌ని వార్తలు వ‌చ్చాయి. 13 నెంబ‌ర్ల‌కు ఇండియా కోడ్ +91 క‌లిపితే మొత్తం 15 నంబ‌ర్లు అవుతాయ‌ని, అంత పెద్ద నెంబ‌రును గుర్తు పెట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న వినియోగదారుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే, కొన్ని సిమ్ కార్డుల‌కు ఆ నెంబ‌ర్లు మారుతోన్న మాట వాస్త‌వ‌మేన‌ని, కానీ, సాధార‌ణ వినియోగ‌దారుల సిమ్ కార్టుల నంబ‌ర్ల మార‌బోవ‌ని సెల్యుల‌ర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) స్ప‌ష్టం చేసింది.

కాబ‌ట్టి వినియోగ‌దార‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని సీవోఏఐ తెలిపింది. స్వైపింగ్ మెషీన్ లు, కార్లు, ఎల‌క్ట్రిసిటీ మీట‌ర్లలో ఉప‌యోగించే సిమ్ కార్డుల నంబ‌ర్లలోని అంకెల సంఖ్య‌ను మాత్ర‌మే 10 నుంచి 13కు పెంచ‌బోతున్నామ‌ని క్లారిటీ ఇచ్చింది. మెషీన్ టు మెషీన్(ఎమ్ టు ఎమ్)ల‌కు మాత్ర‌మే 13 అంకెలు నంబ‌ర్లు రాబోతోన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. త‌మ స‌బ్ స్క్రైబ‌ర్లు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఎయిర్ టెల్, జియో, సీవోఏఐ అధికారులు మీడియాముఖంగా ప్ర‌క‌టించారు. 13 అంకెల సిమ్ కార్డులు రాబోతోన్న మాట వాస్త‌వమేన‌ని, అయితే, అవి వేటికి సంబంధించిన‌వ‌నే దానిపై స్ప‌ష్ట‌త కొర‌వ‌డిని  కొన్ని మీడియా సంస్థ‌లు  ప్ర‌చురించిన వార్త‌ల వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ త‌మ 10 డిజిట్ మొబైల్ నెంబ‌ర్ల‌ను య‌థాత‌ధంగా వాడుకోవ‌చ్చని, సోష‌ల్ మీడియా, కొన్ని మీడియా సంస్థ‌ల్లో వ‌చ్చే త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు.
Tags:    

Similar News