భారత సైన్యంలో కరోనా అలజడి చెలరేగింది. ఏకంగా 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లను క్వారంటైన్ కు తరలించడం సంచలనంగా మారింది. వీరితో కలిసి పనిచేసిన ఓ పోలీస్ వంట మనిషికి కరోనా పాజిటివ్ అని తేలడంతో బీఎస్ఎఫ్ లో కలకలం చెలరేగింది. ఇది యాదృశ్చికంగా జరిగిందా? కుట్ర కోణమా అని ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు. వెంటనే ఆ వంట తిన్న 14 మంది జవాన్లను క్వారంటైన్ కు తరలించారు.
చత్తీస్ ఘడ్ లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో పాల్గొనే బీఎస్ఎఫ్ కు చెందిన 14 మంది జవాన్లు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆగ్రాలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ వీరికోసం ఓ వంట మనిషిని నియమించింది.
అయితే తాజాగా ఆ వంట చేసిన మనిషికి కరోనా సోకినట్లు తేలింది. అయితే వీరంతా ఏప్రిల్ 25న నిన్న ఆగ్రా నుంచి చత్తీస్ ఘడ్ లోని బిలాయ్ పట్టణానికి చేరుకున్నారు. వీరికి వంట చేసిన మనిషికి కరోనా తేలడంతో జవాన్లందరినీ బిలాయ్ పట్టణంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఇప్పటివరకు ఇండియన్ నేవీలో 25మందికి, ఆర్మీలో ఎనిమిది మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం వీరంతా ఆయా ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు.