ఉన్నది ఉన్నట్లుగా చెబితే చాలామందికి కోపం వచ్చేస్తుంది. జాతీయభావాన్ని నిండుగా ఉన్నట్లు నిత్యం మాటలు చెప్పే నేతల చేతుల్లోకి భారతదేశం వెళితే.. అంతో ఇంతో బాగుపడుతుందన్న భావన 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో చాలామందికి అనిపించింది. దాని ఫలితమే.. మోడీ ప్రధాని కుర్చీలో కూర్చోవటం.
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిస్థితులు మొత్తం మారిపోతాయని అనుకోలేదు కానీ.. ఎంతోకొంత మార్పు వస్తుందన్న భావన కలిగింది. గంగను శుద్ధి చేస్తుందన్న మోడీ మాటల్లో నిజం ఎంతన్నది ఇప్పుడిప్పుడే అర్థమువుతుంది. ప్రపంచానికి మహమ్మారిగా మారిన కాలుష్య భూతానికి చెక్ పెట్టే విషయంలోనూ కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత విఫలమయ్యాయో తెలిసేలా తాజాగా ఒక సర్వే నివేదిక వెల్లడైంది.
ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాను తయారు చేశారు. టాప్ 20 నగరాల్లో 14 నగరాలు మన దేశానికి చెందినవే ఉండటానికి మించిన సిగ్గుమాలిన విషయం మరొకటి ఉండదేమో. మరింత సిగ్గుచేటు అయిన విషయం ఏమిటంటే.. దేశ ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కూడా జాబితాలో ఉండటం. అయినా.. మోడీజీ మీరేం ఫీల్ కావొద్దు. ఇలాంటి సర్వేల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ నీతి బోధనల్ని అస్సలు ఆపొద్దు. వాటిని వింటూ మేం కూడా తరిస్తాం. మాకు బోధనలు చాలు. అయినా.. తిట్టుకోవాల్సింది మేం.. మాట్లాడే వారంతా పనోళ్లే అని ఫీల్ కావటం దేశ ప్రజల తప్పు. అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సిందే కదా?
2016లో కాలుష్య పరిమితుల ఆధారంగా ఈ ర్యాంకుల్ని ప్రకటించినట్లుగా చెబుతున్నారు. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది కాలుష్యపూరిత గాలిని శ్వాసిస్తున్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది.
డబ్ల్యూహెచ్ వో తయారు చేసిన ఈ లిస్టులో భారత్ కు చెందిన 14 నగరాలు చూస్తూ..
1. ఢిల్లీ
2. వారణాసి
3. కాన్పూర్
4. ఫరీదాబాద్
5. గయ
6. పాట్నా
7. ఆగ్రా
8. ముజఫరాపూర్
9. శ్రీనగర్
10. గురుగామ్
11. జైపూర్
12. పటియాలా
13. జోధ్ పూర్
14. లక్నో