షాకింగ్ వైనమిది. కలలో కూడా ఊహించనిది జరిగింది. అది కూడా పరాయి దేశంలో కాదు. మనకు కాస్త దూరాన ఉండే ఛండీగఢ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ట్యూషన్ కోసం వెళ్లిన టెన్త్ విద్యార్థిపై సైన్స్ పాఠాలు చెప్పాల్సిన టీచర్ శృంగార పాఠాలు చెప్పటమే కాదు.. ట్యూషన్ మాన్పిస్తామన్న పేరెంట్స్ కు దిమ్మ తిరిగిపోయేలా ఇంట్లో బంధీగా మార్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేనా.. ట్యూషన్ పంపమన్న విద్యార్థి తల్లిదండ్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సూసైడ్ అటెంప్ట్ చేయటం ఈ ఉదంతంలో మరో కొసమెరుపుగా చెప్పాలి. అసలేం జరిగిందన్నది చూస్తే..
చంఢీగఢ్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలి వయసు 35 ఏళ్లు పెళ్లై.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాగా పాఠాలు చెబుతారన్న ఉద్దేశంతో టెన్త్ క్లాస్ చదివే తమ కొడుకును.. అతని చెల్లెళ్లు సదరు లేడీ టీచర్ వద్ద ట్యూషన్ కు పంపుతున్నారు. ఇదిలా ఉంటే.. పిల్లాడు చదువు మీద మరింత దృష్టి పెట్టాలంటే.. ఇద్దరిని వేర్వేరుగా పంపాలని కోరటం.. అందుకు సరేనని పేరెంట్స్ ఒప్పుకున్నారు.
అయితే.. ట్యూషన్ చేరిన నాటి నుంచి పిల్లాడిలో చదువు మీద ధ్యాస తగ్గిపోవటం.. గతంలో వచ్చే మార్కులు కాస్తా మరింత తగ్గటంతో ఆ తల్లిదండ్రులకు అర్ధం కాలేదు. ఇక.. లాభం లేదని.. ట్యూషన్ కారణంగా తెలివైన పిల్లాడు కాస్తా ట్రాక్ తప్పిపోతున్నరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రైవేటు పాఠాలు అక్కర్లేదని చెప్పేందుకు టీచర్ వద్దకు వెళ్లారు. ఇక్కడే.. వారు ఊహించని సీన్ ఒకటి తెర మీదకు వచ్చింది.
ట్యూషన్ మాన్పిస్తామన్న పేరెంట్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పిల్లాడిని గదిలో పెట్టి తాళం వేసింది. దీంతో.. కంగుతిన్న తల్లిదండ్రులు చుట్టుపక్కల వారికి విషయం చెప్పటంతో ఆమెను మందలించి.. పిల్లాడిని గదిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ విద్యార్థిని తీసుకెళ్లిపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సదరు టీచర్.. తన వెంట తెచ్చుకున్న సీసాలోని ద్రవాన్ని తాగేసి ఆత్మహత్యా యత్నం చేయటంతో ఇదెక్కడి గొడవరా? అన్నట్లు మారింది.
ఈ ఉదంతంపై చైల్డ్ లైన్ కు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందన్న అంశంపై విద్యార్థితో ప్రైవేటుగా మాట్లాడిన వేళ.. ఊహించని రీతిలో విషయాలు బయటకు వచ్చాయి. ప్రైవేటు పాఠాలకు వెళ్లిన సదరు టెన్త్ విద్యార్థికి టీచర్ శృంగార పాఠాలు నేర్పే వారని.. గడిచిన మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడేవారన్న విషయం బయటకు వచ్చింది. తన అందాలు ప్రదర్శించి సదరు విద్యార్థి మనసు మళ్లేలా చేయటం.. పాఠాల మీద శ్రద్ధ తగ్గేలా చేయటమే కాదు సదరు కుర్రాడితో తన కోరికల్ని తీర్చుకునేదన్న వైనం బయటకు వచ్చింది.
అంతేకాదు.. తనతో మాట్లాడేందుకు వీలుగా ఎవరికి తెలీకుండా ఒక సిమ్ కార్డు ఇచ్చిందని.. రాత్రిళ్లు తనతో మాట్లాడాలని బలవంతం చేసేదని సదరు విద్యార్థి జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించటంతో ఈ చిత్రమైన వ్యవహారం దిగ్భాంత్రికి గురి చేసింది. కొసమెరుపు ఏమిటంటే.. ఆత్మహత్యాయత్నం చేసేందుకు సదరు లేడీ టీచర్ తాగింది మరేమిటో కాదని.. దగ్గు మందేనని తేల్చారు వైద్యులు. ప్రైవేటు కోసం వచ్చిన విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన సదరు టీచర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ పోయే కాలపు వైనం తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.