ఏదైనా విపత్తు మీద పడినంతనే గుర్తుకు వచ్చేది పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారని.. నాస్ట్రోడామన్ చెప్పిందే జరిగిందని.. ఇలాంటివెన్నో ప్రచారం చేస్తారు. అక్కడెక్కడో పుస్తకాల్లో ఉన్నట్లు సోషల్ మీడియా.. వాట్సాప్ లో పోస్టులు వెల్లువెత్తుతుంటాయి. అందులో నిజం కంటే అబద్ధాలే ఎక్కువ. కానీ.. పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితమే ప్రపంచానికి ఎదరయ్యే విపత్తు గురించి హెచ్చరించాడు. ఏదో చెప్పాడంటే చెప్పాడు అన్నట్లు కాకుండా.. దాని వెనుకున్న కారణాలు.. గ్రహాల స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ..ఏయే దేశానికి ఏమేం జరుగుతుందో ఉదాహరణలతో సహా చెప్పుకుంటూ వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
జోతిష్యం అన్నంతనే చాలామంది మనకు కనిపిస్తారు. కానీ.. వీరిలో శాస్త్రీయంగా మాట్లాడేటోళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు. అందుకు భిన్నంగా పద్నాలుగేళ్ల అభిగ్య అనే మైసూరు పిల్లాడు చెప్పిన మాటలు యథాతధం అన్నట్లుగా చోటు చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.
గ్రహాల స్థితిగతులను చూస్తే ముప్పు వాటిల్లనుందని.. అన్నింటికి మించి 2019 నవంబరు నుంచి 2020 మే వరకు ప్రపంచం విపత్కర పరిస్థితిన ఎదుర్కొంటుందని ముందే హెచ్చరించాడు. వైమానిక రంగం తీవ్రంగా దెబ్బ తింటుందని.. చైనా యుద్ధ సమస్యను ఎదుర్కొంటుందని.. ధనిక దేశాలన్నీ అతలాకుతలం అవుతాయని చెప్పుకొచ్చాడు. అతను చెప్పేవన్నీ ఏదో అదాటున.. యథాలాపంగా.. చీకట్లో రాయి వేసిన చందంగా కాకుండా.. తాను చెప్పే ప్రతి పాయింట్ వెనుకున్న థియరీ చెప్పే ప్రయత్నం చేయటం ఆసక్తికరంగా మారింది.
ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందంటూ చక్కటి విశ్లేషణ చేయటంతో పాటు.. అమెరికాతో పాటు.. యూరప్ దేశాలు ఎదుర్కొనే ఇబ్బందుల్ని ప్రస్తావించాడు. కాకుంటే.. ఇరాన్ లో చోటు చేసుకున్న నాటి పరిస్థితుల నేపథ్యం మనకు కాస్త సూట్ కానట్లు అనిపించినా.. మొత్తంగా చూస్తే మాత్రం... ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న చాలా అంశాల్ని అతగాడు చాలా ముందుగానే స్మెల్ చేశాడని చెప్పక తప్పదు.
ఇంతకీ కుర్రాడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చూస్తే.. పదేళ్ల ప్రాయంలోనే భగవద్గీతలోని 700 శ్లోకాల్ని అనర్గళంగా వల్లె వేయటం.. జ్యోతిష్యం.. అయుర్వేదం.. వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వేసినా.. టక్కున సమాధానం చెప్పటమే కాదు.. అతను మాట్లాడే మాటలు కన్వీన్స్ చేసేలా ఉండటం గమనార్హం. అయుర్వేదిక్ మైక్రో బయాలజీలో పీజీ చేసిన అతను ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పీహెచ్ డీ చేశాడు. జ్యోతిష్యంలో వివిధ విధానాల మీద అనేక పరిశోధనలు చేసిన ఆయన.. వాస్తులోనూ నైపుణ్యాన్ని సాధించాడు. అతని స్థాయిని గుర్తించి చాలా చిన్న వయసులోనే గుజరాత్ లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేదవిశ్వవిద్యాలయం అతన్ని ప్రొఫెసర్ గా నియమించటం చూస్తే.. అతను మామూలోడు కాదన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.