రాజధాని పైన ముఖ్యమంత్రి అసెంబ్లీ లో చేసిన ప్రకటన..అమరావతిలో ప్రకంపలనకు కారణమైంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కుటుంబాలతో కలసి రోడ్డెక్కారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు బంద్ నిర్వహిస్తున్నారు. దుకాణాలు..వాణిజ్య సముదాయాలు మూత బడ్డాయి. సచివాలయం వైపు వెళ్లే బస్సులను అడ్డుకుంటున్నారు. ఉద్యోగులను సైతం ఆపే ప్రయత్నం చేసారు. అనేక చోట్ల మహిళ లు సైతం రోడ్ల పైన బైఠాయించారు. రాజధాని పైన సీఎం ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారి పైన బైఠాయించిన మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేసారు. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. 144 సెక్షన్ పాటుగా యాక్ట్ 30 అమలు చేస్తున్నారు.
మొత్తం 29 గ్రామాల్లోనూ బంద్ కొనసాగుతోంది. మంగళగిరి మండలంలోని గ్రామాల్లోనూ బంద్ ప్రభావం కనిపించింది. రాజధానిని మార్చవద్దంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. మంగళగిరి మండలం కురగల్లులో రైతులు రోడ్లపైకి వచ్చిన రైతులు ఫెస్టిసైడ్ బాటిల్స్‌తో నిరసన చేపట్టారు. మరోవైపు మూడు రాజధానులు నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ నిరుకొండ రైతులు ఆందోళనకు దిగారు. రైతులు..మహిళలు రోడ్ల పైనే గంటల తరబడి బైఠాయించారు. తాము రాజధాని కోసం భూములను సైతం త్యాగం చేస్తే..రాజధాని ఇక్కడి నుండి మారుస్తారా అని నిలదీస్తున్నారు. ఒక్క రాజధానికే డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా నిర్మిస్తందని ప్రశ్నిస్తున్నారు. రాజధాని అమరావతిలో కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేసారు