ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రచారాన్ని అనుసరిస్తూ, సోషల్ మీడియాలో ఐసిస్ అనుకూల వర్గాల వెబ్ సైట్లను నిరంతరం చూస్తున్న సుమారు 150 మంది భారతీయులపై కేంద్ర ఇంటలిజెన్స్ విభాగాలు నిఘా పెట్టాయి. వీరిలో అత్యధికులు దక్షిణ భారతదేశానికి చెందినవారేనట. ఐసిస్ అనుకూల వెబ్ సైట్లను వీక్షిస్తున్న వీరందరిపై ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు. కానీ భవిష్యత్తులో వీరు ఐసిస్ లో చేరకుండా ఉండేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. మరోవైపు నిఘా వర్గాలు ఈ వెబ్ సైట్ లపై ట్రాకింగ్ చేపడుతున్నాయి. వీరిలో ఎవరైనా ఐసిస్ కార్యక్రమాల పట్ల చురుకుగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడితే ముందుగా వారి తల్లిదండ్రులను హెచ్చరించడం, వారికి కౌన్సెలింగ్ చేయడం వంటి చర్యలు చేపడతారు. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఫౌండేషన్ నిపుణుల సహాయంతో ఐసిస్ సంబంధిత ఆన్ లైన్ వెబ్ సైట్లను నిఘా వర్గాలు ట్రాకింగ్ చేస్తున్నాయి.
కాగా దక్షిణ భారత దేశం నుంచి ఐసిస్ పట్ల యువత మొగ్గు చూపడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బెంగళూరు - హైదరాబాద్ లో కొందరు యువతకు ఐసిస్ తో సంబంధాలున్న విషయం బయటపడడం... ఉగ్రవాదుల దాడులకు గతంలో ఈ నగరాలు లక్ష్యం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అత్యంత పాశవిక దాడులతో విరుచుకుపడే ఐసిస్ తీవ్రవాదులు ఇక్కడా విస్తరిస్తున్నారన్న కథనాలతో జనం భయభ్రాంతులవుతున్నారు. నిఘా మరింతగా పెరగాలని, ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. పేలుళ్లు జరిగాక దర్యాప్తులు చేయడం కంటే ముందుగానే నిరోధానికి కృషి చేయాలని.. ఐసిస్ పట్ల ఆసక్తి చూపుతున్నావారిపై కేసులు పెట్టకుండా వదిలేయడం తగదని... వారిని పట్టుకుని విచారించి అవసరమైతే నిర్బంధించాలని అంటున్నారు.