తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారిని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తీసుకొచ్చి మనకు అంటించారు. తాజాగా గురువారం మరో మూడు పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 16కు చేరింది..
14 కేసులు ఇప్పటివరకు అని ప్రకంటించిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.. తాజాగా లండన్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా ఉందని తేల్చడంతో మొత్తం కేసుల సంఖ్య 16కు చేరింది. మార్చి 14న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా తేలింది. అతడి కుటుంబ సభ్యులను ఇంట్లోనే ఉంచి ఐసోలేషన్ చేస్తున్నారు. ఇతడు ప్రయాణించిన విమానంలో కూడా ప్రయాణించి తోటి వారి వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణలో గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో 711మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశారు. వీరిందరినీ ఇంట్లోనే దిగ్బందమై ఉండాలని సూచించారు. 51 మందికి కరోనా టెస్ట్ ను గురువారం చేశారు. ఇప్పటివరకు మొత్తం 498 మందిని పరీక్షించినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతానికి 16మందికి కరోనా ఉందని సర్కారు ప్రకటించింది.