వాళ్లు ప్రభుత్వ అధికారులు.. ప్రజలకు సేవ చేయాల్సిన వారు.. కానీ రైతులకు శఠగోపం పెట్టారు. ఏకంగా 16 లక్షల స్కాం చేశారు. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకున్నా.. అసలు కొనుగోలు చేయమని చెప్పకున్నా సబ్సిడీతో రైతులకు టార్ఫాలిన్లను అందిస్తున్నామంటూ నమ్మించారు. అన్నదాతలకు అంటకట్టారు. టార్ఫాలిన్ల పేరిట జిల్లా వ్యవసాయధికారులు ఆడిన ఈ కుట్ర చదరంగంలో రైతులు దారుణంగా మోసపోగా.. ఏమీ తెలియని ఏఈవోలు బలైపోయారు. వ్యవసాయ శాఖలో వెలుగుచూసిన ‘టార్ఫలిన్ల’ స్కాం ఇప్పుడు కలకలం రేపుతోంది..
నిర్మల్ జిల్లాకు చెందిన వ్యవసాయ ఉన్నతాధికారులు పక్కా ప్లాన్ తో రైతులను మోసం చేసిన వైనం విస్తుగొలుపుతోంది. మొన్నటి వర్షాకాలం సీజన్ లో భారీ వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్న రైతులను చూసి నిర్మల్ జిల్లా అధికారులు మొసలికన్నీరు కార్చారు. ప్రభుత్వం టార్ఫాలిన్లను రైతులకు పంపిణీ చేయడానికి ఎలాంటి సబ్సిడీని ఇవ్వలేదు. అసలు కొనుగోలు చేసి అందించమనలేదు. కానీ రైతుల ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్ఫాలిన్లను సబ్సిడీపై అందిస్తున్నామంటూ నిర్మల్ జిల్లా వ్యవసాయ అధికారులు రైతులను నమ్మించారు. ఏకంగా ఒకటి రూ.1400 చొప్పున ప్రభుత్వం నుంచి సబ్సిడీతో వచ్చిందంటూ రైతులకు అందజేశారు. అయ్యో వ్యవసాయ అధికారులు మంచి పనిచేస్తే ఎందుకిలా విమర్శిస్తున్నారని అనుకోవచ్చు..
ఇక్కడే తిరకాసు ఉంది. వ్యవసాయ అధికారులు రైతులకు ఆదుకుంటున్నామంటూ అందజేసిన నాసిరకం టార్ఫాలిన్లను కేవలం 950కి ఒకటి చొప్పున వాళ్లు కొన్నారు. ప్రభుత్వం ఆదేశించకున్నా.. సబ్సిడీ ఇవ్వకున్నా వీరు సొంతంగా కొనేశారు. ఈ టార్ఫాలిన్లను కింది స్తాయి ఏఈవోల ద్వారా రూ.1400 కు ఒకటి చొప్పున సబ్సిడీతో అందిస్తున్నామంటూ రైతులతో కొనుగోలు చేయించారు. ఒక్కో టార్ఫాలిన్ కు 450 కొల్లగొట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఏకంగా 16 లక్షలను దోచుకున్నారు. ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఏఈవోలు వీటిని రైతులకు అమ్మారు. తిరకాసు ఏంటంటే ఈ టార్ఫాలిన్లు నాసిరకమైనవని.. 950కే కొన్నారన్న విషయం పాపం ఏఈవోలకు కూడా తెలియదు.
ఇలా ఉన్నతాధికారులు ఆడిన మోసపూరిత ఆటలో ఏఈవోలు పావులుగా మారగా.. రైతులు మాత్రం నట్టేట మునిగారు. టార్ఫాలిన్ల అమ్మడం ద్వారా ఏకంగా జిల్లా వ్యాప్తంగా ఇలా దాదాపు 16 లక్షలను వ్యవసాయాధికారులు కొల్లగొట్టిన విషయం వెలుగుచూసింది. ఏఈవోలు తాజాగా ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం వెలుగుచూసింది. నిర్మల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ స్కాం ఇప్పుడు షేక్ చేస్తోంది.