కొద్దికాలంగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోల పట్టు పెరిగిన సంగతి తెలిసిందే. విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో మావోలు పట్టు పెంచుకోవటం కోసం దండకార్యాణాన్ని తమ అడ్డాగా చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా తెల్టెమడుగు అటవీ ప్రాంతంలో భారీగా ఎన్ కౌంటర్ జరిగిందని చెబుతున్నారు.
మావోలు.. పోలీసుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో దాదాపు 16 మంది మావోలు మరణించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఐదుగురుకు పైనే జవాన్లకు గాయాలు అయినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నారు. వాస్తవానికి దండకారణ్యంలో పీఎల్ జీఏ వారోత్సవాలు మొదలయ్యాయి. ఈ నెల 2న మొదలైన వీటి కోసం మావోలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటంతోపాటు.. భారీ రిక్రూట్ మెంట్లు చేయాలని భావించారు. అయితే.. దీనికి బ్రేకులేసేందుకు కేంద్ర బలగాలు దృష్టి పెట్టాయన్న సమాచారంతో రిక్రూట్ మెంట్ ను ఆపేసినట్లు చెబుతున్నారు.
ఇక.. మావోల్ని ఏరి వేసేందుకు రక్షణ దళాలు ప్రత్యేకంగా గాలింపు చర్యలు మొదలెట్టాయి. ఛత్తీస్ గఢ్ లోని పలుజిల్లాల్లో విస్తరించిన ఉన్న అటవీ ప్రాంతంలో అధికారులు గాలింపు చర్యలు మొదలెట్టారు. మరోవైపు.. భారీ ఎన్ కౌంటర్ జరిగిన సుక్మా జిల్లా పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 28 మంది మావోలు లొంగిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోలలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోలు ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన మావోల మృత దేహాల్ని మావోయిస్ట్ లు తీసుకెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా తాజా ఎన్ కౌంటర్.. మావోలకు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.