మరో దారుణం బయటకు వచ్చింది. మృగానికి మించిన మగతనం.. దానికి పవర్ తోడుకావటంతో రక్షకులుగా ఉండాల్సినవారు భక్షకులుగా వ్యవహరించిన భయంకర వాస్తవంగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. 16 మంది మహిళల్ని రేప్ చేయటంతోపాటు..లైంగికంగా.. శారీరకంగా దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఛత్తీస్ గఢ్ కు చెందిన దుర్మార్గపు ఖాకీలు కొందరు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుకు వచ్చిన బాధితులు..తమను పోలీసులు ఎంతగా ఇబ్బంది పెట్టింది వాపోయారు. వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రాధమిక ఆధారాల్ని జాతీయ మానవహక్కుల కమిషన్ కు బాధితులు తమ దగ్గరున్న ఆధారాల్ని సమర్పించారు. ఈ దారుణానికి సంబంధించి మరో 20 మంది బాధితుల వాంగ్మూలం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.
ఛత్తీస్ గఢ్ పోలీసుల చేతిలో 16 మంది మహిళలు శారీరక.. లైంగికహింసకు గురైనట్లుగా తమకు అందిన ప్రాధమిక ఆధారాల్ని చూస్తే అర్థమవుతుందని.. బాధితులకు రూ.37లక్షల పరిహారం ఎందుకు సిఫార్సు చేయకూడదో సమాధానం చెప్పమని రాష్ట్ర సీఎస్ కమిషన్ పేర్కొనటం గమనార్హం. అత్యాచారానికి గురై బాధిత మహిళలకు రూ.3 లక్షల చొప్పున.. లైంగిక దాడులకు గురైన మహిళలకు రూ.2లక్షల చొప్పున ఇవ్వాలని.. శారీరక దాడులు ఎదుర్కొన్న వారికి రూ.50వేల చొప్పున పరిహారం కింద ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. భద్రతా దళాల కారణంగా మానవహక్కుల ఉల్లంఘన భారీగా జరిగిందని.. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కమిషన్ చెప్పటం చూసినప్పుడు.. రక్షకులే భక్షకులుగా మారితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందన్నది ఈ ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/