తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం, తీవ్రతపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 17 మంది ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాలల అధ్యాపకులు కరోనా కారణంగా మృత్యువాతపడ్డారని విద్యాశాఖ పేర్కొంది.
అయితే పోలింగ్ విధుల్లోనే వీరికి కరోనా సోకిందని.. ఆ కారణంగానే చనిపోయారనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టుకు కేసీఆర్ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది.
తెలంగాణలో కోవిడ్ పరిస్థితులు, నియంత్రణ చర్యలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కోరగా.. తాజాగా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా నియంత్రణ చర్యలతోపాటు ఇప్పటివరకు చేపడుతున్న కార్యక్రమాలను కోర్టుకు వివరించింది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికతోపాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది. దీనికి విధుల్లో 9737 మంది ఉపాధ్యాయులు, 185మంది అధ్యాపకులు పాల్గొన్నారని తెలిపింది. అందులో 487మంది టీచర్లు, అయిదుగురు అధ్యాపకులు కరోనా బారిన పడ్డారని తెలిపింది. చనిపోయిన వారిలో 17మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నట్టు తెలంగాణ విద్యాశాఖ హైకోర్టుకు వివరించింది.బాధిత కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాలను యుద్ధ ప్రాతిపదికన చెల్లిస్తామని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక తెలంగాణలో ఇప్పటివరకు 177 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులు ఇద్దిరినీ కోల్పోయి అనాథలయ్యారని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వీరి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అనాథలుగా మారిన పిల్లలకు మూడేళ్ల పాటు నెలకు రూ.2వేలు అందించనున్నట్లు తెలిపింది. పిల్లలకు విద్యాసంస్థల్లో 3శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్రం పేర్కొంది. పిల్లలకు మొబైల్ ఫోన్లు రక్షణగా అందించామని.. ప్రభుత్వ సహాయ ఫోన్ నంబర్లు పెట్టామని తెలిపింది. ఇక లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై తెలంగాణలో 10.34 లక్షల కేసులు పెట్టామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.