రీల్ కు మించిన రియల్ సీన్.. మేయర్ ను చంపేందుకు ఏకంగా 18 మందిని ఏసేశారు

Update: 2022-10-07 04:37 GMT
వెండి తెర మీద క్రైం సీన్ చూసినప్పుడు.. రీల్ కు రియల్ కు మధ్య తేడా చాలా ఉందనిపిస్తుంటుంది. కానీ.. తాజా ఉదంతం గురించి చూస్తే.. రీల్ సీన్ అస్సలు ఎందుకు పనికి రాదన్న భావన కలుగక మానదు. తమ టార్గెట్ అయిన మేయర్ ను హతమార్చేందుకు ఏకంగా 18 మందిని చంపేసిన షాకింగ్ ఉదంతం మెక్సికోలో చోటు చేసుకుంది. మెక్సికో అన్నంతనే అక్కడి డ్రగ్స్ మాఫియా గుర్తుకు రాక మానదు. అత్యంత పవర్ ఫుల్ అయిన డ్రగ్స్ మాఫియా అక్కడ క్రియేట్ చేసే ఆరాచకం అంతా ఇంతా కాదు. అందుకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు.

మెక్సికోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణం కాల్పులతో దద్దరిల్లింది. పట్టణ మేయర్ కాన్రాడో మెండోజా లక్ష్యంగా జరిగిన కాల్పుల్లో ఆయనతో పాటు మేయర్ తండ్రి పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున గాయాలపాలు అయ్యారు. డ్రగ్ మాఫియాకు చెందిన లాస్ టెకిలెరోస్ అనే డ్రగ్స్ ముఠా తాజా ఆరాచకానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. మేయర్ ను చంపేందుకు ప్లాన్ చేసిన వారు.. ఆయన ఉన్న భవనంలో విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.

తమ మారణకాండను వారెంత పకడ్బందీగా ప్లాన్ చేశారంటే.. భారీ వాహనాలతో రోడ్లను బ్లాక్ చేయటంతో పాటు.. తాము టార్గెట్ చేసిన బిల్డింగ్ లోకి పోలీసులు.. సైన్యం ఎంట్రీ కాకుండా ప్లాన్ చేశారు.

మేయర్ ఉన్న భవనంలోకి ప్రవేశించిన వారు.. కనిపించిన వారిని కనిపించినట్లుగా కాల్పులు జరిపారు. అంతిమంగా తమ టార్గెట్ అయిన మేయర్ ను హతమర్చేశారు. అదే క్రమంలో మేయర్ తండ్రిని కూడా హత్య చేశారు.

ఈ ఉదంతం మెక్సికోలో సంచలనంగా మారింది. రాజకీయ పార్టీలు ఈ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించాయి. మేయర్ దారుణ హత్యపై గవర్నర్ ఎవెలిన్ తీవ్రంగా ఖండించారు. నిందితుల్ని వదిలేది లేదని స్పష్టం చేశారు.

నిందితుల్ని పట్టుకునేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతూ నిర్ణయం తీసుకున్నారు. వేట మొదలైంది. మరి నిందితులు పట్టుబడతారా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News