అనుమానం పెనుభూతమైంది. ఒక హత్యకు కారణమైంది. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇటీవల ప్లస్ టు చదువుతున్న చాందిని హత్యను మర్చిపోకముందే.. ఆ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సౌమ్య అనే విద్యార్థిని హత్య చేసిన వైనం సంచలనంగా మారింది.
జీడిమెట్లలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే సౌమ్య అనే 19 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. వరుసకు బావ అయ్యే కృష్ణయ్య అనే వ్యక్తి ఆమెను హత్య చేయటం గమనార్హం. నగరంలోని బోరబండ పర్వత్ నగర్ లో ఉంటున్నాడు. క్యాబ్ డ్రైవర్ గా పని చేసే కృష్ణయ్యకు చింతల్ లోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే సౌమ్యను ఇచ్చి పెళ్లి చేద్దామని ఇరు కుటుంబాల వారు అనుకున్నారు.
ఇదిలా ఉంటే.. తనను పెళ్లి చేసుకోనున్న సౌమ్య.. కాలేజీలో మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని భరించలేకపోయాడు. మాట్లాడుకుందామని పిలిచాడు. హెచ్ఎంటీలోని ఖాళీ ప్రదేశానికి రావాలన్నాడు. నమ్మి వచ్చిన సౌమ్యతో మాట్లాడుకునే క్రమంలో వారి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో.. కోపంతో ఆమె ఛాతీ మీద కొట్టటంతో సౌమ్య అక్కడికక్కడే మృతి చెందింది.
మరణించిన ఆమెను మూట కట్టి తన వాహనంలో తీసుకొచ్చిన కృష్ణయ్య కూకట్ పల్లి ఐడిఎల్ చెరువులో పడేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మరోవైపు కాలేజీకి వెళ్లిన సౌమ్య సాయంత్రమైనా రాకపోవటంతో వారి కటుంబసభ్యులు ఆందోళన చెందారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో కృష్ణయ్య లొంగిపోవటంతో అసలు విషయం బయటకు వచ్చింది. కాలేజీకి వెళ్లిన కూతురు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటంపై సౌమ్య తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సౌమ్య ప్రవర్తన మీద అనుమానంతోనే తాను హత్య చేసినట్లుగా కృష్ణయ్య ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర.. పది గంటలకు హత్య జరగగా.. రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో పోలీసుల వద్దకు వచ్చిన నిందితుడు లొంగిపోయాడు. ఇటీవల హత్యకు గురైన చాందిని ఉదంతాన్ని తలపించేలా ఉన్న ఈ హత్య నగరంలో ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది.