1950.. తెలుగోళ్ల‌కు అవ‌స‌ర‌ప‌డే ఫోన్ నెంబ‌ర్!

Update: 2019-01-14 06:26 GMT
ఐదేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల పండ‌గ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది. తెలుగోళ్ల‌కు పెద్ద పండ‌గైన సంక్రాంతి హ‌డావుడి త‌గ్గిన నెల రోజుల‌కే లోక్ స‌భ ఎన్నిక‌ల వేడి రాజుకోనుంది. తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌లు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో లోక్ స‌భ‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఎన్నిక‌లన్న వెంట‌నే ఓటు ఉందా?  లేదా? అన్న సందేహంతో పాటు.. ఓటు విష‌యం మీద ఎంక్వ‌యిరీ చేసుకోవాలంటే ఎలా అన్న ప్రాధ‌మిక సందేహం ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతూ ఉంటుంది. ఇటీవ‌ల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 1950 ఫోన్ నెంబ‌ర్ ను ప్ర‌యోగించి చూశారు. 30 మంది బృందంతో తెలంగాణ‌లో ఎన్నిక‌ల కాల్ సెంట‌ర్ ను నిర్వ‌హించారు. ఈసారి మ‌రింత మందితో ఈ కాల్ సెంట‌ర్ ను భారీగా నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు.

ఈ ద‌ఫా.. ఈ కాల్ సెంట‌ర్ పూర్తిస్థాయిలో నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో ఈసీ ఉంది. ఏ ఓట‌ర్ అయినా త‌మ ఓటు ఉందా?  లేదా?  అన్న విష‌యాన్ని 1950 నెంబ‌రుకు ఫోన్ చేస్తే.. వారికి అవ‌స‌ర‌మైన స‌మాచారం అంద‌నుంది. ఈ కాల్ సెంట‌ర్ ను గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌మైన‌జ‌న‌వ‌రి 26 నుంచి ప్రారంభించే అవ‌కాశం ఉంది.

ఎన్నిక‌ల వేళ‌.. ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించుకోవాల‌న్న ప్ర‌చారాన్ని స్టార్ట్ చేయ‌నున్నారు. అయితే జ‌న‌వ‌రి 26 కానీ.. లేదంటే జ‌న‌వ‌రి 27 నుంచి కానీ ఈ కాల్ సెంట‌ర్ ప్రారంభం కానుంది. ఈ కాల్ సెంట‌ర్ కు ఓట‌ర్ల జాబితాను అందుబాటులో ఉంచ‌నున్నారు. దీంతో.. ఎవ‌రికి ఓటు ఉంది?  మ‌రెవ‌రికి ఓటు లేద‌న్న విష‌యాన్ని తెలుసుకునే వీలుంది. ఎన్నిక‌ల వేళ అంద‌రికి త‌మ ఓటు ఉందా? అన్న సందేహం వెంటాడుతూ ఉంటుంది. దాన్ని.. 1950 నెంబ‌రుకు ఫోన్ చేయ‌టం ద్వారా సందేహాన్ని నివృతి చేసుకునే వీలుంది.


Tags:    

Similar News