కరుడుగట్టిన నేరస్తుల్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వారి నుంచి ప్రతిఘటన ఎదురైనప్పుడు వారిని ఎన్ కౌంటర్ చేసేయటం మామూలే. అయితే.. ఈ ఎన్ కౌంటర్లపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతుంటాయి. ఆరోపణలు కూడా వస్తుంటాయి. ఇందులో పాల్గొన్న పోలీసులకు ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అభినందనల కంటే కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎన్ కౌంటర్ చేస్తున్నామని.. వచ్చి లైవ్ కవరేజ్ చేయాలంటూ మీడియాను పిలిచిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రియల్ ఎన్ కౌంటర్ ను చూస్తే.. ఫోటోలు.. వీడియోలు తీసుకోవాలన్న పోలీసుల మాట సంచలనంగా మారింది. ఇంతకీ యూపీ పోలీసులు ఎందుకలా చేశారు? ప‌్రచారం కోసమా? అనాలోచితంగా చేశారా? అన్న ప్రశ్నలువేసుకుంటే ముందుచూపుతోనే ఇలా చేసినట్లుగా చెప్పాలి.
ఇటీవల యూపీలో దంపతులు.. ఇద్దరు రైతులు.. మరో ఇద్దరు పూజారులతో కలిసి మొత్తంగా ఆరుగురిని హతమార్చిన కరుడుగట్టిన నేరస్థులు ముస్తకిన్.. నౌషద్ లు బైక్ మీద వెళుతుండగా పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకున్న వారిద్దరూ స్థానికంగా పాడుబడిన నీటిపారుదల శాఖ కార్యాలయంలోకి వెళ్లారు.
ఈ ఎన్ కౌంటర్ పై తమకు ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు వీలుగా.. పోలీసులు మీడియాను పిలిచారు. వారుచూస్తుండగా.. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయటం.. అందుకు ప్రతిగా వారు కాల్పులు జరపటం.. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు.
కాసేపటికి కాల్పుల మోత ఆగటంతో భవనంలోకి వెళ్లిన పోలీసులకు నిందితులు మరణించినట్లుగా గుర్తించారు. తాము సంచలనాల కోసం ఎన్ కౌంటర్ చేయలేదని.. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసి ఆఖరి యత్నంగా మాత్రమే ఎన్ కౌంటర్ చేసిన వైనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు.. తాము తమ విధుల పట్ల పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని అర్థం అయ్యేలా చేయటం కోసమే మీడియాకు సమాచారం అందించారని చెప్పక తప్పదు. ఈ రియల్ ఎన్ కౌంటర్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Full View