ఈ ఏడాది ఫిబ్రవరికి ముందు జెలన్ స్కీ.. అన్నంతనే క్వశ్చన్ మార్కు వేసే వాళ్లే ఎక్కువ మంది కనిపిస్తారు. కానీ.. రష్యా మొదలు పెట్టిన యుద్ధంతో ఆయన ప్రపంచానికి సుపరిచితుడు కావటమే కాదు.. ఇప్పుడాయన ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ.. రష్యా తమపై చేస్తున్నయుద్ధంలో ఆయన పోరాడుతున్న వైనం ప్రపంచం మొత్తం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. రష్యా చేస్తున్న యుద్ధం పది రోజుల్లో ముగిసిపోతుందని.. ఉక్రెయిన్ చేతులు ఎత్తేస్తుందని భావించినా.. ఇప్పుడు పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా చోటు చేసుకోవటం తెలిసిందే.
చూస్తుండగానే.. 72 రోజులు గడిచిపోయాయి. మరెన్ని రోజులు యుద్ధం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ కు అపార నష్టం వాటిల్లటమేకాదు.. దాదాపు కోటి మంది వరకు ఉక్రెయిన్లు తమ సొంత ఇళ్లను వదిలి వలస పక్షులుగా మారారు. యుద్ధం ఆగినా.. ఉక్రెయిన్ పూర్వ పరిస్థితికి చేరుకోవటానికి ఎన్నాళ్లు పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా రెండుపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీకు సంబంధించినవే.
మే 9 రష్యాకు అత్యంత ప్రత్యేకమైన రోజు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీలో నాజీలపై సోవియెట్ యూనియన్ విజయం సాధించిన రోజు. ప్రతి ఏడాది మే 9 వచ్చిందంటే చాలు.. ఆ రోజున ప్రత్యేక వేడుకగా జరుపుకోవటమే కాదు.. రష్యా తమ మిలటరీ సత్తాను ప్రపంచానికి చాటి చెబుతూ ఉంటుంది. అలాంటి మే 9.. వచ్చేసింది. ఇలాంటి వేళ.. జెలన్ స్కీ ఒక వీడియోను విడుదల చేశారు.
1945 మే 9న నాజీలు సోవియెట్ యూనియన్ ముందు లొంగిపోగా.. తాజాగా మాత్రం నాటి సోవియెట్ యూనియన్లో భాగమైన ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన వీడియోలో జెలన్ స్కీ.. 'చెడు మళ్లీ తిరిగి వచ్చింది. కాకుంటే అది వేరే రూపంలో. వేరే నినాదాలతో వచ్చింది. కానీ ప్రయోజనం మాత్రం అదే. ఈసారి ఉక్రెయిన్ దాని మిత్రదేశాలు తాజా యుద్దంలో గెలుస్తాయి. మంచిపై చెడు ఎన్నడూ విజయం సాధించదు" అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మే 9కు ఒక రోజు ముందు విడుదల చేసిన ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడికి సంబంధించిన మరో ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది. జలెన్ స్కీ ధరించిన ప్రత్యేక ఖాకీ జిప్ అప్ ఉన్ని జాకెట్ ను తాజాగా లండన్ లో జరిగిన చారిటీ వేలాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాజరయ్యారు.
ఈ జాకెట్ ను అధిక ధరకు కొనుగోలు చేయాలని.. వేలంలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ వేలం ప్రారంభం కావటానికి ముందు వర్చువల్ గా జెలన్ స్కీ మాట్లాడారు. కష్ట కాలంలో ఉక్రెయిన్ కు అండగా ఉన్న బ్రిటన్ కు.. ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇక.. వేలంలో జెలన్ స్కీ కోటుకు ఏకంగా 90వేల డాలర్ల ధర పలికింది. మన రూపాయిల్లో చెప్పాలంటే 69.25 లక్షలుగా చెప్పాలి.