మరో యుద్ధం తప్పదా ?

Update: 2022-08-04 04:29 GMT
ఒకవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావమే ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తుంటే మరో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పెరిగిపోతోంది. రోజురోజుకు రోగ్ నేషన్ గా ప్రచారంలో ఉన్న చైనాకు తైవాన్ కు మధ్య గొడవలు బాగా పెరిగిపోతున్నాయి.

తాజాగా తైవాన్ భూభాగంపై చైనా 20 యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడంతో  ఉద్రిక్తతలు పెరిగిపోతోంది. తైవాన్ భూభాగంపై చైనా వైపునుండి మొత్తం 21 విమానాలు చొచ్చుకు వస్తే అందులో 18 యుద్ధ విమానాలున్నాయి.

ఉక్రెయిన్-రష్యా  యుద్ధానికి పరోక్షంగా అమెరికా ఎలా కారణమైందో ఇపుడు చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగటానికి కూడా అమెరికాయే కారణమవడం గమనార్హం. ఒకవైపు ప్రపంచదేశాలకు నీతులు, బుద్ధులు చెబుతున్నట్లు నటిస్తునే మరోవైపు అంతర్గతంగా ఉద్రిక్తలను రెచ్చగొడుతోంది. చైనా అభ్యంతరాలను లెక్కచేయకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్  నాన్సీ పెలోసి తైవాన్లో పర్యటించటం వల్లే ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.

అమెరికా, మిత్రదేశాల దన్ను చూసుకునే ఉక్రెయిన్ కూడా రష్యాపై యుద్ధానికి దిగింది. తీరాచూస్తే తన సైన్యాన్ని పంపకుండా కేవలం ఆయుధాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే ఉక్రెయిన్ కు అమెరికా అమ్ముకుంటోంది.

యూఎస్ఎస్ఆర్ నుండి విడిపోయి ఉక్రెయిన్ ప్రత్యేక దేశం ఎలాగయ్యిందో 1949లో చైనా అంతర్యుద్ధంలో తైవాన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. అప్పటినుండి తైవాన్ను కలుపేసుకునేందుకు చైనా తెగ ప్రయత్నిస్తోంది. చైనాను వ్యతిరేకిస్తున్న అమెరికా మిత్రదేశాలు తైవాన్ కు మద్దతుగా నిలిచాయి. దాంతో చైనా-అమెరికాకు మధ్య చాలా గొడవలువుతున్నాయి.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగినట్లే తైవాన్ పై చైనా కూడా హఠాత్తుగా యుద్ధానికి దిగుతుందేమో అని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. ఇదే జరిగితే యావత్ ప్రపంచం అల్లాడిపోవటం ఖాయం. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్లే చాలాదేశాలు తిండిగింజలు, చమురు, గ్యాస్ అందక అల్లాడిపోతున్నాయి. దీనికి అదనంగా చైనా-తైవాన్ యుద్ధం కూడా మొదలైతే అంతే సంగతులు. ఏదో కారణంతో ప్రపంచంలోని చాలా దేశాలు చైనాపైన ఎంతగా ఆధారపడ్డాయో మొన్నటి కరోనా మహమ్మారి కారణంగా బయటపడింది.
Tags:    

Similar News