ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా జరిపిన వైమానిక దాడిలో పెద్ద సంఖ్యలో భారతీయులు మృతిచెందారు. ఏకంగా 20 మంది భారతీయులు ఈ దాడిలో మృతిచెందారని తెలుస్తోంది. యెమెన్ పట్టణం అల్ హొదైదాహ్ ఓడరేవు పై సౌదీ మిత్రకూటమి విమానాలు బాంబులు, క్షిపణులతో దాడి చేశాయి. ఈ దాడిలో భారతీయులు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. 12మంది షియా ఉగ్రవాదులూ ఈ దాడిలో మృతిచెందారు.
కాగా, యెమెన్ లో వైమానిక దాడిలో భారతీయులు మరణించినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగశాఖ చెబుతోంది. తిరుగుబాటుదారుల విజృంభణ తర్వాత యెమెన్ లో గత ఏప్రిల్ లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. భారత ప్రభుత్వం అనేకమంది భారతీయులను తిరిగి ఇండియాకు రప్పించింది. అయితే... ఇప్పటికే చాలామంది భారతీయులు అక్కడే ఉంటున్నారు.