అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా దెబ్బకు ప్రపంచమే కుదేలు అయిపోతోంది. రోజులు గడుస్తున్నా.. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ఏదీ రాకపోవటం.. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరగటమే కానీ తగ్గని దుస్థితి. తాజాగా అప్ఘనిస్థాన్ దేశాధ్యక్షుడి ప్యాలెస్ లో ఏకంగా ఇరవై మందికి కరోనా పాజిటివ్ కేసులు తేలటంపై ముక్కున వేలేసుకుంటున్నారు. అధ్యక్షుల వారి ప్యాలెస్ లో అంతమందికి పాజిటివ్ కేసులు నమోదైనా.. దేశాధ్యక్షుడు అష్రప్ ఘనీ మాత్రం సేఫ్ గా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయనకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేస్తున్నారు.
కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదైన నేపథ్యంలో దేశాధ్యక్షుల వారి భవనాన్ని మూసివేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. పాలనా విభాగంలోనూ మరో పన్నెండు మందికి వైరస్ సోకినట్లుగా గుర్తించారు. కరోనాను కట్టడి చేసేందుకు అప్ఘాన్ లో లాక్ డౌన్ ను విధించారు. కేసుల తీవ్రత తగ్గకపోవటంతో.. లాక్ డౌన్ ను మరో మూడు వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకూ ఆ దేశంలో 33 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 933 మంది మాత్రమే కరోనా బారిన పడినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. వాస్తవంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. కరోనా నిర్దారణ పరీక్షలు పరిమితంగా సాగటంతో.. కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా వెలుగు చూస్తున్నాయన్న విమర్శ వినిపిస్తోంది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తే.. గణాంకాలు మరోలా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.