ప్రచారం కోసం వ్యాపారస్తులు చాలానే చేస్తుంటారు. కొందరు పెద్ద పెద్ద హీరోలు.. హీరోయిన్లను తీసుకొస్తే.. మరికొందరు తెలిసినంతనే ఎగబడే ఆఫర్లు పెట్టేస్తుంటారు. ఓపెనింగ్ ఆఫర్ తో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వాలని.. దాంతో తమ గురించి అందరికి తెలియాలన్న తపన పడుతుంటారు.
తాజాగా అలాంటి పనే చేసి అందరిని పరేషాన్ చేశారు పెద్దపల్లి నగరానికి చెందిన వస్త్ర వ్యాపారి ఒకరు. తాజాగా తన షాపులో చీర ఒక్కొక్కటి రూ.20లకే అమ్ముతున్నట్లుగా ప్రచారం చేశారు. గురువారం ఉదయం నుంచి ఆ ఆఫర్ ఉంటుందని ప్రకటించారు. దీంతో.. పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు.
చీరల కోసం ఎగబడ్డారు. ఈ బంపర్ ఆఫర్ గురించి తెలిసిన చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు కూడా ఈ షాపు వద్దకు విరగబడ్డారు. దీంతో.. వచ్చిన మందిని అదుపు చేయటం బాగా కష్టమైంది. పెద్ద ఎత్తున మహిళలు తరలిరావటంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో చీరలు అమ్మాలనుకున్న వారు కాస్తా.. చేతులెత్తేసి షాపు క్లోజ్ చేసేశారు. కేవలం ప్రచారం కోసం.. తమ ప్రయోజనాల కోసం పేద ప్రజలను.. సామాన్యుల్ని ఆకర్షించి వారిని ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి వ్యాపారులకు షాకిచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉందన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. రూ.20 చీర లాంటి ఆఫర్లు పెట్టే ముందు కచ్ఛితంగా స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలన్న నిబంధనను పెడితే మంచిదని చెబుతున్నారు. ఇలాంటి ఆఫర్ల కారణంగా పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంటే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారన్న విషయాన్ని మర్చిపోకూడదు. తమ లాభం కోసం.. తమ వ్యాపార ప్రయోజనాల కోసం అమాయక మహిళల ఆశల్ని సొమ్ము చేసుకోవాలనుకునే ఈ తరహా వ్యాపారులపై చర్యలు చాలా అవసరమన్న మాట వినిపిస్తోంది.