ఆ బామ్మ వయసు.. 80 ఏళ్లు. కానీ.. ఆమె చేసే పనులు మాత్రం 20 ఏళ్లను తలపిస్తాయి. వాస్తవానికి 80 ఏళ్ల వయసులో ఎవరైనా తమ వాళ్లతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తారు. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా మరొకరిపై ఆధారపడుతుంటారు. ఎవరూ తోడు లేకపోతే ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో మరికొంతమంది ఉంటారు. కానీ మధ్యప్రదేశ్కు చెందిన ఓ 80 ఏళ్ల బామ్మ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా జీవనాన్ని సాగిస్తున్నారు.
అంతే కాకుండా తాజాగా తన బైక్పై 600 కిలోమీటర్లు రైడ్ చేసి దైవ దర్శనానికి కూడా వెళ్లారు. చేయాలనే దృఢ సంకల్పం ఉంటే వయసుతో సంబంధం లేదని నిరూపించారు.
నీమచ్ జిల్లా మనాస మండలానికి చెందిన సోహన్‌బాయి అనే 80 ఏళ్ల వృద్ధురాలు.. బాబా రామ్దేవ్రాను నిత్యం ఆరాధిస్తుంటారు. అయితే తన స్వస్థలానికి వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న బాబా రామ్ దేవ్రా పుణ్యక్షేత్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉన్న బైక్పై బయలుదేరారు.
కానీ తనతోపాటు ఎవ్వరినీ తీసుకెళ్లలేదు. బైక్పై ఒంటరిగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బాబా రామ్ దేవ్రా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చారు. మార్గమధ్యలో ఆమె పర్యటన గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. నీమచ్ జిల్లాలోని జాలీనర్ గ్రామానికి చెందిన సోహన్ బాయి.. మనాసలో నివాసం ఉంటున్న హరిచంద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
పెళ్లయిన కొద్దిరోజులపాటు వారిద్దరి వైవాహిక జీవితం సాఫీగా సాగినా.. ఆ తర్వాత తరచూ గొడవలు జరిగాయి. దీంతో సోహన్ బాయి తన పిల్లలను తీసుకుని ఒంటరిగా జీవించారు. ఇప్పుడు ఆమె పిల్లలు స్థిరపడి మంచి స్థితిలో ఉన్నా.. సోహన్బాయి మాత్రం మళ్లీ ఒంటరిగానే ఉంటున్నారు.
అయితే సోహన్బాయి ఏటా బైక్పైన బాబా రామ్దేవ్రా పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుంటారని గ్రామస్థులు చెబుతున్నారు. ఏదేమైనా.. 80 ఏళ్ల వయసులో 20 ఏళ్లదూకుడు చూపిస్తున్న బామ్మకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. ఆమె ఆరోగ్య రహస్యాలపై నెటిజన్లు.. ముచ్చటపడుతున్నారు.