20 ఏళ్ల కిందట సంయుక్త ఆతిథ్యం.. నేడు మాజీ చాంపియన్లకు షాకిచ్చి ఆసియా జట్ల సింహనాదం
ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లీగ్ దశ ముగిసింది. నాకౌట్ చేరిన జట్లేవో తేలిపోయింది. అయితే, అన్నిట్లోనూ మాజీ చాంపియన్లకు చుక్కలు చూపించి ఆసియా సింహాలు నాకౌట్ బెర్తు కొట్టడం ఇక్కడ విశేషం. తొలిరౌండ్ లోనే ఇంటిముఖం పట్టిన ఆ మాజీ చాంపియన్లు జర్మనీ, ఉరుగ్వే. ఇక వాటిని మట్టి కరిపించిన ఆసియా సింహాలు జపాన్, దక్షిణ కొరియా. గ్రూప్-ఈ తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు ఛాంపియన్ జర్మనీకి షాకిచ్చిన జపాన్.. చివరి మ్యాచ్‌లో మరో మాజీ ఛాంపియన్ స్పెయిన్ కూ చెక్ పెట్టింది. ఈ ఫలితంతో జర్మనీ నిరాశగా వరుసగా రెండోసారీ తొలి రౌండ్ లోనే తప్పుకొంది. మరో ఊహించని ఫలితం ఏమంటే.. గ్రూప్-హెచ్ నుంచి దక్షిణ కొరియా అనూహ్యంగా నాకౌట్లో అడుగు పెట్టడం. వాస్తవానికి పోర్చుగల్ తో చివరి మ్యాచ్ ఆడిన దక్షిణ కొరియా గెలుపుపై ఎవరికీ ఆశల్లేవు. ఎందుకంటే.. క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ ను ఓడించడం ఆ జట్టుకు పెద్ద కష్టమే. కానీ, దానిని సునాయాసం చేసింది కొరియా. ఇదే సమయంలో ఈ ఫలితం ఉరుగ్వే పాలిట ఉరుము లేని పిడుగులా మారింది. రెండుసార్లు చాంపియన్ అయిన ఉరుగ్వే తన చివరి మ్యాచ్‌లో .. ఘనాను ఓడించినా ఫలితం లేకపోయింది.
సరిగ్గా 20 ఏళ్ల కిందట..ఫిఫా ఫుట్ బాల్ కప్ లో కొరియా నాకౌట్‌కు చేరడం ఇది మూడోసారి. 2002 ఫిఫా ప్రపంచ కప్ ను దక్షిణ కొరియా-జపాన్ సంయుక్తంగా నిర్వహించాయి. ఆతిథ్య దేశాలుగా నాడు వైల్డ్ కార్డ్ ద్వారా వీటికి నేరుగా టోర్నీ ఆడే అవకాశం దక్కింది. కాగా, ఆ కప్ లో కొరియా చెలరేగి ఆడి సెమీస్ కు చేరింది. 2002లో సెమీస్ చేరిన కొరియా.. 2010లో రౌండ్-16కు అర్హత సాధించింది. ఇక మరో ఆతిథ్య జట్టు జపాన్ కూడా సూపర్ -16కు అర్హత సాధించింది. అయితే, అక్కడ టర్కీ చేతిలో పరాభవంతో వెనుదిరిగింది. కొరియా మాత్రం క్వార్టర్స్ లో స్పెయిన్ ను మట్టికరిపించింది. అయితే, సెమీస్ లో జర్మనీకి 0-1తో తలొంచింది. టర్కీతో మూడోస్థానం కోసం జరిగిన పోరులోనూ ఓడింది. నాలుగో స్థానంలో నిలిచింది.
నేడు చావోరేవో మ్యాచ్ లో..వాస్తవానికి పోర్చుగల్ తో మ్యాచ్ గెలిస్తేనే కొరియా నాకౌట్ చేరుతుంది. అలాంటి మ్యాచ్‌లో అదరగొట్టింది. తమకంటే బలమైన పోర్చుగల్‌ను ఓడించింది. ఈ విజయంతో ఉరుగ్వే కు నిరాశ మిగిలింది. ఆట చివరి నిమిషాల్లో అదృష్టం కలిసిరావడంతో.. వాంగ్ హి చాన్ సూపర్ గోల్‌తో దక్షిణ కొరియా రౌండ్-16 మెట్టెక్కింది. 62 శాతం బంతిని తన నియంత్రణలోనే ఉంచుకున్న పోర్చుగల్.. కీలక సమయాల్లో స్కోరు చేసేందుకు కొరియాకు అవకాశం ఇచ్చింది. వాస్తవానికి మ్యాచ్ లో మొదట గోల్ కొట్టింది పోర్చుగలే.
ఆ జట్టు ఆటగాడు రికార్డో హోర్టా 5వ నిమిషంలోనే గోల్ చేశాడు. 27వ నిమిషంలో కిమ్ యంగ్ జివోన్ దానిని సమం చేశాడు. స్టాపేజ్ టైమ్ (90+1)లో పాస్‌ను అందుకొన్న సన్ హువాంగ్ మిన్ మెరుపు వేగంతో పోర్చుగల్ గోల్‌వైపు కదిలాడు. డిఫెండర్లు అడ్డుతగిలినా బంతిని తన ఆధీనంలో ఉంచుకొన్న సన్.. పెనాల్టీ ఏరియాలోకి చొచ్చుకొచ్చిన చాంగ్‌కు పాస్ చేయడం.. అతడు కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతి నేరుగా నెట్‌లోకి పంపాడు.
జపాన్ జయభేరి..మరో ఆసియా జట్టు జపాన్ ది కూడా కప్ లో విజయవంతమైన రికార్డే. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 తేడాతో 2010 ప్రపంచకప్ విజేత స్పెయిన్‌ను ఓడించింది. రిత్సు డోన్ (48వ నిమిషంలో), తనక (51వ) చెరో గోల్ కొట్టారు. స్పెయిన్ తరపున మొరాటా (11వ) గోల్ చేశాడు. చిత్రమేమంటే.. ఇదే స్టేడియంలో తొలి మ్యాచ్‌లో జర్మనీని ఇదే తేడాతో జపాన్ ఓడించింది. అప్పుడు కూడా తొలుత వెనుకబడి తర్వాత రెండు గోల్స్ కొట్టింది. గ్రూప్‌లో అగ్రస్థానం (2 విజయాలు,ఓ ఓటమితో 6 పాయింట్లు)తో సగర్వంగా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆ జట్టు తొలిసారి వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో నాకౌట్‌కు చేరింది.
చావుతప్పి కన్నులొట్టబోయి ఈ టోర్నీలో స్పెయిన్, పోర్చుగల్ నాకౌట్ కు చేరాయంటే లక్ కలిసొచ్చింనే చెప్పాలి. జపాన్ చేతిలో స్పెయిన్ ఓడినా గ్రూప్ లో రెండో స్థానంతో ముందంజ వేసింది. స్పెయిన్, జర్మనీ ఒక్కో విజయం, గెలుపు, డ్రా చొప్పున 4 పాయింట్లతో సమంగా నిలిచాయి. కానీ మెరుగైన గోల్ అంతరంతో జర్మనీ (1)ని స్పెయిన్ (6) వెనక్కినెట్టింది. తొలి మ్యాచ్‌లో కోస్టారికాపై 7-0 గెలవడం స్పెయిన్‌కు కలిసొచ్చింది. జపాన్‌పై స్పెయిన్ గెలిచి.. కోస్టారికాపై తాము నెగ్గితే జర్మనీకి నాకౌట్ చేరే అవకాశం ఉండేది. కానీ జపాన్.. స్పెయిన్‌కు షాకివ్వడంతో అంతా తలకిందులైంది. ఇక పోర్చుగల్ ముందే రెండు మ్యాచ్ లు గెలిచి ఉండడంతో ఇబ్బంది లేకపోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.