208 మందిని చంపారు..వారికి ఉరిశిక్షే వేయండి

Update: 2015-09-23 10:55 GMT
 2006 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష వేయాలని ప్రాసిక్యూషన్ కోరింది. 2006 జులై 11న ముంబయిలో రైళ్లలో బాంబులు పెట్టడంతో 188 మంది అక్కడికక్కడే మృతిచెందారు... చికిత్స పొందుతూ 20 మంది ప్రాణాలు కోల్పోయారు.. సుమారు వెయ్యి మంది గాయపడ్డారు. ఈ కేసు ప్రత్యేక  మోకా కోర్టులో ఉంది... ఇంతటి భయానక కుట్రకు కారణమైన 12 మందిలో 8 మందికి ఉరిశిక్ష వేయాలని ప్రాసిక్యూషన్ లాయర్ బుధవారం కోర్టును కోరారు. మిగతా నలుగురికి యావజ్జీవ శిక్ష విధించాలని కోరారు.

మోకా కోర్టు ఈ కేసుపై ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా 12 మందిని దోషులుగా నిర్ధారించినప్పటికీ శిక్షలు ఖరారు చేయలేదు. ఈ నెల 30న వారికి శిక్షలు ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న వాదనల్లో భాగంగా బుధవారం ప్రాసిక్యూషన్ లాయర్ ఎనిమిది మంది నిందితులకు ఉరిశిక్ష వేయమని కోర్టును కోరారు.

సుమారు పదేళ్ల కిందటి ఈ దాడి మొత్తం కేవలం 11 నిమిషాల్లోనే జరిగినా తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. 11 నిమిషాల వ్యవధిలో ఏడు వేర్వేరుచోట్ల రైళ్లు, సబర్బన్ స్టేషన్ లలో బాంబులు పేల్చారు. 208 మంది మృతికి కారణమయ్యారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ నెలలో 12 మందిని దోషులని తేల్చింది. మరో వారం రోజుల్లో వారికి శిక్షలు ఖరారు కానున్నాయి.

Tags:    

Similar News