బార్సిలోనా సాకర్ స్టార్ - ఈ మధ్యే అంతర్జాతీయ ఫుట్ బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన లియోనెల్ మెస్సీకి ఒకే రోజు రెండు షాక్ లు తగిలాయి. బార్సిలోనా కోర్టులో పన్ను ఎగవేత కేసులో 21 నెలల జైలుశిక్ష పడింది. అతని తండ్రి జార్జ్ కు కూడా ఇవే నేరాల కింద 21 నెలల జైలు శిక్ష విధించింది. మెస్సీ మొత్తం మూడు నేరాలకు పాల్పడ్డాడని కోర్టు ప్రకటించింది.
జైలుశిక్షతో పాటు మెస్సీకి 20 లక్షల యూరోలు - అతని తండ్రికి 15 లక్షల యూరోల జరిమానాను బార్సిలోనా కోర్టు విధించింది. తమ తీర్పుపై స్పానిష్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని మెస్సీకి సూచించింది. అయితే స్పానిష్ చట్టాల ప్రకారం రెండేళ్లలోపు జైలుశిక్షను తిరిగి పరిశీలించే అవకాశం ఉండటంతో మెస్సీ - అతని తండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకపోవచ్చు.
కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ మధ్యే ఆ జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్ బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయితే రిటైర్మెంట్ ప్రకటించడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అసలే ఫుట్ బాల్ కు దూరమై వైరాగ్యంలో ఉన్న మెస్సీ ఇప్పుడు కోర్టు తీర్పు బ్యాడ్ టైంగా చెప్తున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో టాప్ టెన్ లో మెస్సీ ఉన్నారు.