కేరళలో 213 మంది చనిపోయారా ?

Update: 2022-04-19 06:30 GMT
దేశంలో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 2183 కేసులు నమోదవ్వటమే కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. అంతకుముందు ఆదివారం నమోదైన 1150 కేసులు ఎక్కువని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటిది సోమవారం దానికి రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవ్వటంతో ఉన్నతాధికారులతో టెన్షన్ పెరిగిపోతోంది. దానికి తోడు దేశవ్యాప్తంగా 214 మంది మరణిస్తే ఒక్క కేరళలోనే 213 చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.

దేశం మొత్తం మీద 11542 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణంకాలు వివరిస్తోంది. క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను చూస్తుంటే కేసుల సంఖ్య బాగా పెరిగే అవకాశాలే ఉన్నాయనిపిస్తోంది. మహారాష్ట్రలో ప్రధానంగా ముంబైలో కేసుల నమోదు పెరుగుతోంది.

అలాగే కర్నాటకలో బెంగుళూరు, కేరళ, తెలంగాణాలో హైదరాబాద్ లాంటి నగరాల్లో కేసుల తీవ్రత పెరిగిపోతోంది. అందుకనే మళ్ళీ మాస్కు ధరించాల్సిన అనివార్యత పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అన్నీ రాష్ట్రాలతో సమీక్షిస్తోంది.

ఒకవైపు చైనాలో కూడా కరోనా కేసులు ప్రతిరోజు వేలల్లో పెరిగిపోతోంది.  అతిపెద్ద నగరం షాంఘై దాదాపు నెలరోజులుగా లాక్ డౌన్లోనే ఉంది. ఇంత కఠినంగా లాక్ డౌన్ అమలుచేస్తున్నా రోజుకు 25 వేల కేసులు నమోదవ్వటం ఆందోళనగా ఉంది. చైనాతో పోల్చితే మనదేశంలో ఆంక్షలను కఠినంగా అమలు చేసే అవకాశంలేదు.

అందుకనే మళ్ళీ కేసుల నమోదు పెరిగిపోతోంది. నిజానికి మనదేశంలో భౌతిక దూరం పాటించటం ఏ విధంగాను సాధ్యంకాదు. కనీసం మాస్కన్నా ధరించమంటే అదికూడా చాలామంది వేసుకోవటంలేదు.

ఇలాంటి నేపధ్యంలో కేసులు మళ్ళీ నమోదవటంలో ఆశ్చర్యమేమీ లేదు. కేరళ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక రాష్ట్రమని అందరికీ తెలిసిందే. కాబట్టి కేరళలో కేసుల తీవ్రత, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ దేశం మొత్తం మీద చనిపోయిన 214 మందిలో ఒక్క కేరళలో మాత్రమే 213 మంది చనిపోయారంటే మాత్రం పరిస్ధితి ఆందోళనకరమనే అనుకోవాలి. హైదరాబాద్ లో కూడా తీవ్రత పెరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదముంది.
Tags:    

Similar News