సినిమాల్లో అన్నాదమ్ములు విడిపోయి పెద్దయ్యాక 25 ఏళ్లకు కలుసుకోవడం చూసి ఆహా ఓహో అనుకుంటున్నాం.. ఇలాంటి కథలు చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టేసి ఉంటుంది. కానీ అలాంటిదే తెలంగాణలో చోటుచేసుకుంది. ఎంతో ఉద్వేగాన్ని నింపింది. సినిమాలను తలపించేలా 21 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు దొరికింది.
తెలంగాణలోని ఆలంపూర్ లో నాగశెట్టి, సత్యవతి దంపతులు నివసించేవారు. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఐదో కుమార్తె శ్రీదేవి. 2001లో ఆమె వయసు 14 ఏళ్లు. ఆ వయసులో తన సోదరి వద్దకు వెళుతున్న క్రమంలో శ్రీదేవి హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో తప్పిపోయింది. బిడ్డ కోసం తల్లిదండ్రులు, అక్క, బావ తీవ్రంగా వెతికారు. కానీ వారి ప్రయత్నలేవీ ఫలించలేదు. శ్రీదేవిపై ఆశలు వదిలేసుకున్నారు.
10 రోజుల క్రితం కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి గుజరాత్ పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వడోదరలోని పారుల్ సేవాశ్రమంలో చికిత్స పొందుతున్న మహిళ.. తనది కర్నూలు జిల్లా ఆలంపూర్ అని చెబుతోందని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సదురు మహిళ ఫొటోను ఎస్పీ వాట్సాప్ లో తెప్పించుకున్నారు.
ఈ క్రమంలోనే మహిళ వివరాలను కనుక్కునే బాధ్యతను దిశా పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులకు ఎస్పీ అప్పగించారు. అలంపూర్ వెళ్లి విచారించారు. బాలిక తల్లి మృతి చెందిందని వారు గుర్తించారు.
శ్రీదేవి తండ్రి, సోదరి 14 ఏళ్ల క్రితమే కర్నూలు మండలం దేవమడ గ్రామానికి వలస వెళ్లారని స్తానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు దేవమడకు వచ్చి వీడియో కాల్ ద్వారా శ్రీదేవితో మాట్లాడించారు. ఆ తర్వాత గుజరాత్ కు వెళ్లి ఆమెను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
21 ఏళ్లకు తప్పిపోయిన బాలిక ఇంటికి చేరడంతో ఇన్నాళ్లు ఎదురుచూసిన ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు.