నరహంతకులు విమానాన్ని కూల్చేశారు

Update: 2015-10-31 11:06 GMT
ఈజిప్ట్‌ నుంచి రష్యా వెళుతున్న రష్యా ఎయిర్‌ లైన్‌ కు చెందిన విమాన సినాయ్‌ ప్రొవిన్స్‌ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. 224 ప్రయాణికులు, సిబ్బందితో ఈజిప్ట్‌ నుంచి రష్యాకు శనివారం ఉదయం బయలుదేరిన ఈ విమానానికి కొద్ది సేపటికే గ్రౌండ్‌ కంట్రోల్‌ తో సంబంధాలు తెగిపోయాయి.. దీంతో ఈ విమానం మిస్సింగ్‌ అయినట్లుగా భావించారు. గాలింపు చేపట్టగా విమానం సినాయ్‌ ప్రొవిన్స్‌ ప్రాంతంలో కూలిపోయినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో నరహంతకులైన ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండడంతో విమానాన్ని వారే కూల్చేశారని భావిస్తున్నారు.

విమానంలో ప్రయాణిస్తున్న వారిలో అధికులు రష్యాకు చెందిన వారే.. రష్యాకు చెందిన ప్రయాణీకులు ఈజిప్ట్‌ లో పర్యటించి తిరిగి తమ స్వదేశానికి విమానంలో వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.  ప్రమాద స్థలానికి 50 అంబులెన్సులను ఈజిప్టు ప్రభుత్వం పంపించింది. విమానంలో ఉన్నవారిలో ఒక్కరు కూడా బతకలేదని గుర్తించారు.  విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 17 మంది పిల్లలు, 200 మంది పెద్దలు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు.

షినాయ్ ప్రాంతంలో కుప్పకూలిపోవడం వెనుక ఐఎస్ ఐఎస్ హస్తం ఉందన్న బలమైన అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఐఎస్ ఐఎస్ బలంగా ఉన్న ప్రాంతంలో విమానం కూలిపోవడం, ఆ సమయంలో వాతావరణ ప్రతికూలతలు ఏమీ లేకపోవడంతో ఇది వారి పనేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Tags:    

Similar News