ఏమనాలి? ఏమని చెప్పాలి? హైదరాబాద్ మహా నగరంలో రోడ్డు మీద నడవటం కూడా నేరమేనా? ఆ నేరానికి మూల్యం నిండు ప్రాణమా? వాన పడిన వేళ.. రోడ్డు మీద నడిచే వ్యక్తిని మింగేసే మ్యాన్ హోళ్లు భూతాల్లా నోళ్లు తెరుచుకొని చూస్తున్న వైనం చూస్తే కడుపు మండిపోవటం మామూలే. ఈ రోజు ప్రాణాలు పోగొట్టుకున్నది ముక్కు ముఖం తెలీని వాళ్లు కావచ్చు.కానీ.. రేపొద్దున ఆ జాబితాలో నేనో.. మీరో.. మనకు అయినవాళ్లో.. కావాల్సిన వారో.. పరిచయస్తులో ఉండొచ్చు. అందుకే ఈ ఆవేదన.. మాదాపూర్ లాంటి ఏరియాలోచోటు చేసుకున్న దారుణం కళ్లకు కట్టినట్లుగా సీసీ కెమేరా ఫుటేజ్ లభించటంతో.. అసలు విషాదం ఏమిటో అర్థమయ్యే పరిస్థితి. ఆ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వ నగరంగా మారుస్తానని.. ఇస్తాంబుల్ నుంచి టెక్సాస్ వరకూ చాలానే నగరాల పేర్లతో జత కట్టి.. హైదరాబాద్ మొత్తాన్ని మార్చేస్తానని.. బంగారు తెలంగాణకు హైదరాబాద్ కోహినూర్ వజ్రంగా మారుస్తానన్న చందంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు చెబుతుంటారు. నేతలు అన్నాక మాటలు చెప్పటం మామూలే. కానీ.. ముఖ్యమంత్రిస్థాయి అధినేత మాటలు చెబితే.. అందులో ఎంతోకొంత వాస్తవం ఉండాలి.
రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర బాధత్యల్ని తీసుకున్న వేళ.. కేసీఆర్ చాలానే మాటలు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దుర్మార్గ సీమాంధ్ర పాలకుల కారణంగా హైదరాబాద్ సిటీ ఎంత దారుణంగా తయారైందన్న విషయాన్ని చెబుతూ.. రోడ్ల మీద వర్షపు నీరు నిలబడటాన్ని.. తెరిచి ఉండే మ్యాన్ హోళ్ల గురించి ఆయన మండిపడేవారు. కానీ.. అలాంటి ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. రెండేళ్లు గడిచిన తర్వాత మాదాపూర్ లాంటి ప్రైమ్ ఏరియాలో.. నడి రోడ్డు మీద తెరుచుకున్న మ్యాన్ హోల్.. నడుస్తున్న ఒక మనిషి నిండుప్రాణాన్ని తీయటానికి మించిన దారుణం ఏముంటుంది..?
మాదాపూర్ లోని ఒక ప్రైవేటు హాస్టల్ లో మోతీ యాదవ్ అనే 24 ఏళ్ల యువకుడు టీ మాస్టర్ గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి పని ముగించుకొని మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు. ఒక చోట వర్షం నిలిచి ఉండటంతో..అక్కడున్న పెద్ద రాళ్ల మీద కాలు పెట్టి దాటబోయాడు. కానీ.. కాలు జారటం.. అది కాస్తా మ్యాన్ హోల్ కావటంతో క్షణాల్లో మునిగిపోయాడు. దీంతో అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసి పోయింది. దీన్ని చూసిన ఒక వ్యక్తి వెంటనే అక్కడకువెళ్లినా అప్పటికే మునిగిపోయాడు. ఈ ఉదంతం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చినా ఎలాంటి ప్రయోనం లేకుండా పోయింది. మాదాపూర్ ప్రధాన రోడ్డు మీదున్న మ్యాన్ హోల్ మనిషిని పొట్టన పెట్టుకోవటం ఏమిటి కేసీఆర్ ? అంటూ ప్రశ్నించే వారికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏమని బదులిస్తారు..?