ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే 25 జిల్లాలు ఏర్పడబోయే చాన్స్ ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఇప్పటికే మూడు రాజధానులు అవసరం అని సీఎం జగన్ చరిత్ర సృష్టించాడని విజయసాయిరెడ్డి కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే జగన్ సంకల్పమని.. అధికారం కోసం కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. విశాఖను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చేసిన జగన్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. త్వరలోనే 25 జిల్లాలుగా ఏపీని విభజించడం ఖాయమని విజయసాయిరెడ్డి పరోక్షంగా హింట్స్ ఇచ్చారు.
విశాఖ పట్నంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం చేసిన ఈ వేడుకల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు సహా వైసీపీ నేతలు, కార్యకర్తలు పొల్గొన్నారు. కేక్ కట్ చేసి జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణతో అభివృద్ధి చేస్తుందని.. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలుగా చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలన్నదే సీఎం జగన్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. త్వరలోనే 25 జిల్లాలు చేసి అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ సంకల్పం అని ఆయన వివరించారు.