టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు జైలుశిక్ష

Update: 2015-12-10 15:42 GMT
దాడి కేసులో తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మరణించగా.. అతనికి పరిహారం ఇవ్వాలంటూ దాడి చేసిన ఘటనలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే.. పటాన్ చెర్వు శాసన సభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

కొద్దికాలం కిందట పటాన్ చెర్వు పరిధిలోని పారిశ్రామికవాడ పాశ మైలారంలో ఒక పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలంటూ ఎమ్మెల్యే దాడి చేశారంటూ ఒక ఫిర్యాదు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన సంగారెడ్డి అదనపు జ్యూడిషీయల్ జడ్జి విచారించారు. సంస్థ ఆరోపించినట్లుగా.. ఎమ్మెల్యే దాడి చేశారన్న అంశాన్ని ధ్రువీకరించిన కోర్టు.. ఎమ్మెల్యేకు రెండేళ్లు జైలుశిక్ష.. రూ.2500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
Tags:    

Similar News