బీజేపీ వర్సెస్ టీఆర్ ఎస్ మధ్య జరుగుతున్న పొలిటిల్ ఫైర్ రోజు రోజుకు పెరుగుతోంది. వ్యాఖ్యలు.. విమర్శ లకు తోడు ఇటీవల కాలంలో ట్వీట్ల యుద్ధం కూడా పెరిగిపోయింది. తమల పాకుతో నువ్వొకటంటే.. తలు పు చెక్కతో నే రెండంటా! అన్నట్టుగా ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం జోరుగా సాగుతోంది.
తాజాగా ఈ పొలి టికల్ సినారియోలో.. సరికొత్త అంశం వచ్చి చేరింది. ``రెండున్నరవేల కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రి ని చేస్తామంటూ కొంతమంది నన్ను సంప్రదించారు`` అని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ ఎస్ మధ్య మరింత వేడిని రగిలించింది.
ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. మంత్రి కేటీఆర్.. బీజేపీపై ఫైరయ్యారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నడ్డాజీ.. అంటూనే బీజేపీ జాతీయ అధ్యక్షుడికి చురకలు అంటించారు. ``కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కావాలంటే రూ.2500 కోట్లు అడుగుతున్నారంట నడ్డాజీ.. మీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు.. దీనికి మీరేమంటారు.. 40 శాతం కమీషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్లు, 30 శాతం కమీషన్ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు అంటున్నారు. అలాగే సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలకు ఆదేశాలేమైనా ఉన్నాయా? అన్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు`` అని కేటీఆర్ నిలదీశారు.
అసలు ఏం జరిగింది?
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండున్నరవేల కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రిని చేస్తామంటూ కొంతమంది తనను సంప్రదించినట్లు వెల్లడించారు. కొంతమంది మధ్యవర్తులు ఈ మొత్తం డిమాండ్ చేశారని తెలిపారు. శుక్రవారం జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించిన బసనగౌడ వారు ఎవరనేది మాత్రం బహిర్గతం చేయలేదు.
పార్టీ టికెట్ ఇప్పిస్తాం.. సోనియా గాంధీ, జేపీ నడ్డాతో సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కొందరు వస్తుంటారన్న బసనగౌడ్.. అలాంటి వారు తనవద్దకు ఓ సారి వచ్చినట్లు తెలిపారు. రెండున్నర వేల కోట్లు ఇస్తే సీఎం చేస్తామని ప్రతిపాదించినట్లు వివరించారు.
రాజకీయాల్లో డబ్బులకు పదవులను ఆశచూపే దొంగలను నమ్మకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవాల ని బసనగౌడ సూచించారు. బసనగౌడ పాటిల్ వాజ్‌పేయీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలు ఆయన కాంటెస్ట్‌లో అన్నారో తెలియదు కానీ.. ఈ వ్యాఖ్యలు రాజకీయ మంటలు రేపుతున్నాయి. బసనగౌడ వ్యాఖ్యలపై దర్యాప్తు చేయించాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిమాండ్ చేశారు.ఇప్పుడు ఏకంగా.. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ.. కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. మరి దీనిపై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.