బీఆర్ నాయుడుని టార్గెట్ చేసిన పవన్ ?

ఏపీలోని కూటమి ప్రభుత్వంలో కీలక నాయకుడిగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఏమి మాట్లాడినా అది సంచలనమే అవుతుంది.

Update: 2025-01-10 11:42 GMT

ఏపీలోని కూటమి ప్రభుత్వంలో కీలక నాయకుడిగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఏమి మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. ఆయన చేసే ప్రతీ ప్రకటనను డిప్యూటీ సీఎం హోదాతో పాటు కూటమిలో రెండవ అతి పెద్ద పార్టీ అధినేతగానే జనాలు తీసుకుంటారు.

ఇక పవన్ నోటి వెంట ఒక్క మాట వస్తే అది ఫుల్ గా వైరల్ అవుతుంది. అయితే తిరుపతిలో తొక్కిసలాట సందర్భంగా పవన్ అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ తొక్కిసలాట ఘటనకు టీటీడీ చైర్మన్ , ఈవో, జేఈవో బాధ్యత వహించాలని అన్నారు.

అంతటితో పవన్ ఆగలేదు. లేటెస్ట్ గా పిఠాపురం లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినపుడు ఇదే మాటను అన్నారు. ఈ ఘటన మీద టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు జేఈవో సహా టీడీపీ బోర్డు సభ్యులు మొత్తం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేకపోతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. తొక్కిసలాటలో వంద మంది దాకా నలిగిపోయారు. ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారు.

తొక్కిసలాట బాధితుల కష్టాలను విని తాను కరిగిపోయాను అని పవన్ అన్నారు. వారిని కన్నీటి కష్టాలు అని ఆయన అన్నారు. బీఆర్ నాయుడు, శ్యామలరావు వెంకయ్య చౌదరి క్షమాపణ చెప్పాల్సిందే అని పవన్ మరోసారి గట్టిగా చెప్పారు.

మీరు బాధితులను పరామర్శించి వారి కష్టాలను వింటే అపుడు అర్ధం అవుతుందని అన్నారు. ఈ తొక్కిసలాటలో గాయపడ్డ వారు దేవుడు దయతో బయటకు వచ్చామని చెప్పారని పవన్ అన్నారు. మా కర్మ ఇలా అయింది అని అంటున్నారు. వాళ్ళకు క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు.

మొత్తానికి పవన్ టీడీపీ బోర్డు సభ్యులు ఒక్కొక్క వ్యక్తి గురించి కధ వింటే తెలుస్తుందని అన్నారు. మీకు వేరే దారి లేదు అంటూ ఆయన అన్నారు. ఇవన్నీ చూస్తే టీటీడీ పాలక మండలి చైర్మన్ ని పవన్ టార్గెట్ చేశారా అనిపిస్తోంది. నిజానికి ఈ ఘటనలో సమిష్టి బాధ్యత అంతా వహించాలని కూడా పవన్ అన్నారు

ఆయన గత రెండు రోజులుగా ఇదే ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనకు సంబంధించి పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. కానీ అసలు టీటీడీకే మూలవిరాట్టుగా ఉన్న చైర్మన్ ఈవో, జేఈవోల విషయంలో మాత్రం పవన్ స్పందిస్తున్నారు అంటున్నారు.

టీటీడీ అంటే ఆ ముగ్గురే కీలకం కదా అంటున్నారు. మిగిలిన వారి మీద యాక్షన్ తీసుకున్నట్లే వారి విషయంలో ఏదో ఒకటి చేయాలని పవన్ భావిస్తున్నట్లుగా ఉంది అందుకే ఆయన పదే పదే క్షమాపణలు చెప్పండి అని కోరుతున్నారు. మరి పవన్ డిమాండ్ మీద టీటీడీ బోర్డు స్పందించి ఆ విధంగా చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

ఎందుకంటే పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ డిమాండ్ చేస్తున్నారు. కూటమిలో కీలకంగా ఉన్నారు. టీటీడీ విషయంలో పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే క్షమాపణలు చెప్పడం ద్వారా బీఆర్ నాయుడు తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు అవుతుందని, అపుడు ఆయన రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News