చ‌చ్చిపోతామ‌ని రాష్ర్ట‌ప‌తిని ప‌ర్మిష‌న్ అడిగారు

Update: 2015-08-14 16:01 GMT
మ‌న‌దేశంలో రైత‌న్న‌ల ప‌రిస్థితి ఎలా మారిందంటే వారు పండించిన పంట‌కు స‌రైన గిట్టుబాట ధ‌ర ఉండ‌దు. ఎంతో క‌ష్ట‌ప‌డి పంట‌లు వేస్తే అటు ప్ర‌కృతి ప్ర‌కోపానికి త‌ట్టుకుని పండించిన పంట‌ను మార్కెట్ లో ద‌ళారులు చెప్పిన రేటుకు అమ్ముకోవాల్సి వ‌స్తోంది. ఈ ఇబ్బందులు ఇలా ఉంటే ప్ర‌భుత్వాలు త‌మ అవ‌స‌రాల కోసం భూసేక‌ర‌ణ చేసి దానికి కూడా స‌రైన ప‌రిహారం చెల్లించ‌కుండా రైతుల‌ను ఇబ్బందులు పెడుతున్నాయి. ప‌రిహారం ఇచ్చినా మార్కెట్ రేటుతో పోల్చుకుంటే అత్తెస‌రు ప‌రిహార‌మే వారికి ద‌క్కుతోంది.

తాజాగా యూపీలో ఓ బ్యారేజ్ నిర్మించేందుకు భూములిచ్చిన రైతుల‌కు ప‌రిహారం ఇవ్వ‌క‌పోవ‌డంతో ఏకంగా 25 వేల మంది రైతులు తాము చ‌నిపోతామంటూ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ ముఖ‌ర్జీ ని ప‌ర్మిష‌న్ అడిగారు. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

యూపీలోని మ‌థుర జిల్లాలో గోకుల్ బ్యారేజ్ నిర్మాణం కోసం 11 గ్రామాల‌కు చెందిన 25వేల మంది రైతులు 700 ఎక‌రాల‌ను ప్ర‌భుత్వానికి ఇచ్చారు. బ్యారేజ్ నిర్మాణానికి రైతుల నుంచి భూసేక‌ర‌ణ చేసిన ప్ర‌భుత్వం వారికి ప‌రిహారం మాత్రం ఇవ్వ‌లేదు. ప‌రిహారం కోసం ఎన్నిసార్లు ప్ర‌భుత్వానికి మొర‌పెట్టుకున్నా ఉప‌యోగం లేక‌పోవ‌డంతో నిరాశ‌చెందిన 25వేల మంది రైతులు తాము దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన ఆగ‌స్టు 15న మూకుమ్మ‌డిగా చ‌నిపోయేందుకు పర్మిషన్  ఇవ్వాలంటూ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ని వేడుకుంటూ త‌మ నిర‌స‌న తెలిపారు. ఈ విధంగా అయినా రాష్ర్ట ప్ర‌భుత్వం క‌రుణించి త‌మ‌కు ప‌రిహారం ఇస్తుంద‌న్న ఆశ‌తో వారు ఈ విధంగా నిర‌స‌న తెలిపారు.

రైతుల ఈ వినూత్న నిర‌స‌న‌తో అయినా యూపీ ప్ర‌భుత్వం దిగి వ‌చ్చి ఆ రైతుల‌కు ప‌రిహారం చెల్లిస్తుందో లేదా రాష్ట్రపతి  జోక్యం చేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News