వెన‌క‌డుగు లేదు!..వార‌ణాసి బ‌రిలో 28 మంది మ‌నోళ్లు!

Update: 2019-05-01 10:52 GMT
న్యాయ‌మైన డిమాండ్ల సాధ‌న కోసం వార‌ణాసిలో అడుగుపెట్టిన తెలంగాణ‌లోని నిజామాబాద్ ప‌సుపు రైతులు - ఏపీలోని ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు సాధ‌న స‌మితి నేత‌లు స‌త్తా చాటార‌నే చెప్పాలి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పోటీ చేస్తున్న నేప‌థ్యంలో మ‌నోళ్ల‌కు అక్క‌డ ప‌ట్ట ప‌గ‌లే చుక్క‌లు క‌నిపించాయి. అక్క‌డి బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఆదిత్య‌నాథ్ యోగి స‌ర్కారు రంగంలోకి దించిన ఖాకీలు వెంటాడి వేధించినా కూడా మ‌నోళ్లు ఏమాత్రం వెనక్కి త‌గ్గ‌లేదు. మోదీపై ఏకంగా 28 మంది మ‌నోళ్లు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఓ వైపు నామినేష‌న్ ప‌త్రాలే అంద‌కుండా అడ్డుకున్నా... మొక్కవోని ప‌ట్టుద‌ల‌తో సాగిన మ‌నోళ్లు నామినేష‌న్లు వేసేదాకా విశ్ర‌మించ‌లేదు. అయితే న‌లుదిక్కుల నుంచి ఎదురైన ఇబ్బందుల కార‌ణంగా 52 మంది మ‌నోళ్లు నామినేష‌న్లే వేయాల్సి ఉండ‌గా... కేవ‌లం 28 మంది మాత్రం ఆ ప‌ని చేయ‌గ‌లిగారు.

నిజామాబాద్ లో ప‌సుపు బోర్డు ఏర్పాటును డిమాండ్ చేస్తూ అక్క‌డి రైతులు టీఆర్ ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై ప‌దుల సంఖ్య‌లో పోటీకి దిగారు. అదే ఉద్య‌మ స్ఫూర్తితో వార‌ణాసికి 50 మంది ప‌సుపు రైతులు త‌ర‌లివెళ్లారు.  అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాల‌న్న డిమాండ్ ను దేశ‌వ్యాప్తంగా వినిపించేందుకు వెలిగొండ ప్రాజెక్టు సాధ‌న స‌మితి నుంచి ఇద్ద‌రు ప్ర‌కాశం జిల్లా వాసులు వార‌ణాసికి బ‌య‌లుదేరారు. మొత్తంగా తెలుగు నేల నుంచి 52 మంది వార‌ణాసికి వెళ్లార‌న్న మాట‌. ఈ క్ర‌మంలో మ‌నోళ్లు అక్క‌డ అడుగు పెట్టీ పెట్ట‌గానే స్థానిక బీజేపీ నేత‌లు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. వారి బారి నుంచి ఎలాగోలా త‌ప్పించుకున్నా... యూపీ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా మ‌నోళ్లను వెంబ‌డించారు. అయినా వెనక్కు త‌గ్గ‌ని తెలుగోళ్లు... నామినేష‌న్ ప‌త్రాలు దొర‌క‌బుచ్చుకునేందుకు నానా తంటాలే ప‌డ్డారు.

నామినేష‌న్ ప‌త్రాలు దొరికినా... వాటిని ప్ర‌పోజ్ చేసేందుకు ఒక్కో నామినేష‌న్ కు క‌నీసం ప‌ది మందైనా లోక‌ల్ ఓట‌ర్లు కావాలి క‌దా. ఇక్క‌డే అక్క‌డి బీజేపీ నేత‌లు - యూపీ పోలీసులు చ‌క్రం తిప్పారు. మ‌నోళ్లు ఆశ్ర‌యించిన స్థానికుల‌కు బెదిరింపుల రుచి చూపిస్తూ సాగారు. ఈ త‌ర‌హా వేదింపుల‌కు ఏమాత్రం వెర‌వ‌ని మ‌నోళ్లు చాలా ఓపిగ్గానే ముందుకు సాగారు. ఈ క్ర‌మంలో మ‌నోళ్ల నామినేష‌న్ల‌ను ప్ర‌తిపాదించేందుకు అవ‌స‌ర‌మైన 520 మంది ల‌భించ‌క‌పోగా... కేవ‌లం 280 మంది మాత్రం దొరికారు. దీంతో ప‌సుపు రైతులు 26 మంది - వెలిగొండ్ ప్రాజెక్టు సాధ‌న స‌మితికి చెందిన ఇద్ద‌రు ప్ర‌కాశం జిల్లా వాసులు ఇద్ద‌రు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.

Tags:    

Similar News