ప్రపంచ వ్యాప్తంగా పెను చర్చకు తావిచ్చిన పనామా పేపర్స్ భారీ కుంభకోణానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు చాలానే బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. చరిత్రలో ఇప్పటివరకూ వెల్లడైన కుంభకోణాల్లో కెల్లా ఈ తాజా స్కాం అతి పెద్దదిగా.. స్కాంలకే పెద్దన్నగా చెబుతున్నారు. ఈ కుంభకోణానికి సంబందించి పరిశీలించిన పత్రాల సైజు చూస్తేనే కొండంత ఈ కుంభకోణం రేంజ్ ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది.
ఈ కుంభకోణానికి సంబంధించిన అంశాలు బయట పెట్టటానికి పరిశీలించిన పత్రాలు ఏకంగా ఒక కోటి 15 లక్షలు కావటం గమనార్హం. ఇదొక్కటేనా.. భారీ డేటాను పరిశీలించి.. పరిశోధించిన తర్వాత దీని గుట్టురట్టు చేసే ప్రయత్నం చేశారు. పత్రాల విషయంలోనే కాదు.. కాలం విషయంలోనూ ఇది భారీ స్కాంగా చెప్పొచ్చు. ఈ స్కాంను గడిచిన 40 ఏళ్లుగా చేస్తున్నారు. తాజా స్కాం పుణ్యమా అని గడిచిన 40 ఏళ్లలో జరిగిన దారుణ మోసాలు బయటకు వెల్లడైనట్లే.
ఇక.. ఈ కుంభకోణానికి సంబంధించి విడుదలైన రహస్య పత్రాలు సైతం భారీ రికార్డును సృష్టించాయి. ఈ పత్రాల సైజును డిజిటల్ రూపంలో చూసినప్పుడు ఏకంగా 2.6టీబీలుగా ఉండటం విశేషం. అంటే.. సుమారు 2300 సినిమాలకు సమానమైన డేటా అన్న మాట.
ప్రపంచంలో ఇప్పటివరకూ అనేక కుంభకోణాల సందర్భంగా వెల్లడైన రహస్య పత్రాల కంటే ఈ పత్రాలు ఎన్నో రెట్లు అధికమని చెప్పొచ్చు. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన వికీలీక్స్ బహిర్గంతం చేసిన రహస్య పత్రాల సైజు కేవలం 1.7 జీబీ మాత్రమే. 2013లో బోగస్ సంస్థల గురించి విడుదలైన నివేదిక సైజు 260 జీబీలు కాగా.. 2014లో లక్సెంబర్గ్ పత్రాల లీకు సైజు 4 జీబీ.
మరో విశేషం ఏమిటంటే.. ఈ కుంభకోణానికి సంబంధించి ఈ మొయిల్స్.. డేటాబేస్.. పీడీఎఫ్ లు.. ఇమేజ్ లు.. టెక్ట్స్ సమాచారం మొత్తం కలిపితే కోట్ల సంఖ్యలో ఉంటాయి. మరింత భారీ కుంభకోణాన్ని బయట పెట్టేందుకు ఒకరిద్దరు కాకుండా వివిధ దేశాలకు చెందిన 100 మీడియా సంస్థలకు చెందిన 370 మంది పరిశోధక జర్నలిస్ట్ లు దీనిపై పని చేయటం గమనార్హం.