ఇప్పుడో సిత్రమైన వాతావరణం నెలకొంది. గతానికి భిన్నంగా మారిన ఈ పరిస్థితిని చూసినప్పుడు అనుభవించే వాడికి తప్పించి.. అందరికి అర్థం కాని పరిస్థితిగా దీన్ని చెప్పొచ్చు. పెళ్లి కాని ప్రసాదులకు పెళ్లిళ్లు కావటం కాస్త కష్టంగా మారింది. అందునా.. పెళ్లికి ఓకే అనాలంటే.. అమ్మాయి తరఫు వారి కోరికలకు రీచ్ కావటం అందరికి సాధ్యం కావట్లేదు. దీంతో.. పలువురికి పెళ్లిళ్లు కాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు తమిళనాడుకు చెందిన పెళ్లి కాని ప్రసాద్ ఒకరు.
అలాంటి అతడు.. తనకో మంచి భార్య కావాలన్న ఆలోచనను.. అందరికి అర్థమయ్యేలా చేయటం కోసం చేసిన ప్రయత్నం వినూత్నంగా మారింది. అదిప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
తమిళనాడులోని విల్లుపురానికి చెందిన జగన్ కు 27 ఏళ్లు. ఐదేళ్లుగా పెళ్లి చేసుకోవటం కోసం సంబంధాలు చూస్తున్నాడు. అయినా అతడికి తగ్గ అమ్మాయి దొరకలేదు. చూసిన పెళ్లి సంబంధాలు అన్ని ఇన్ని కావు. దీంతో.. ఈ మధురై వాసి రోటీన్ కు భిన్నంగా ఆలోచించాడు.
కంపెనీలో మేనేజర్ గా వ్యవహరించే అతను పార్ట్ టైంగా పోస్టర్ డిజైన్ చేస్తుంటాడు. దీంతో.. తన పెళ్లి కోసం తన వివరాలతో కూడిన ఒక పోస్టర్ ను తయారు చేశాడు. అందులో తన ఫోటోతో పాటు.. తన వివరాలన్ని స్పష్టంగా ఉండేలా చూసుకున్నాడు. పేరు.. కులం.. తనకొచ్చే జీతం.. తాను చేసే పని.. సెల్ నెంబరుతో పాటు.. తన ఇంటి అడ్రస్ ను సైతం అందులో పేర్కొంటూ.. భారీ ఎత్తున పోస్టర్లు మదురై అంతా అంటించేయించాడు.
దీంతో.. ‘నాకో మంచి భార్య కావాలి’ అన్న పోస్టర్లు ఇప్పుడా పట్టణంలో దర్శనమిస్తూ.. జగన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ‘ఇప్పటివరకు తాను ఎన్నో పోస్టర్లను డిజైన్ చేశానని.. తానుు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారంగా తనకు సంబంధించిన వివరాలతో పోస్టర్ డిజైన్ చేయాలన్న ఆలోచన కలిగింది.
తొంభై లలో పుట్టిన వారికి పెళ్లి కుమార్తె దొరకటం కష్టంగా ఉంది. అందుకే పోస్టర్ రూపొందించాలన్న ఆలోచన కలిగింది. దాన్ని అమలు చేశా’ అంటూ చెబుతున్నారు జగన్. ఆయన కోరుకున్నట్లుగా మంచి భార్య దొరకాలని ఆశిద్దాం.