జాతీయ కుటుంబ సర్వే ప్రకారం పురుషులు వేసేక్టమీ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నా.. ఇంట్లోవాళ్లు అడ్డుచెబుతున్నారు.మహిళల కంటే పురుషులకే ఈజీ.. ఎఫెక్ట్ కాదని అంటున్నారు. పురుషులు వేసెక్టమీ చేయించుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా కుటుంబ నియంత్రణ కోసం ఆడవారినే ప్రోత్సహిస్తున్నారు. ప్రకటనలు, ఇతర ప్రచార కార్యక్రమాలన్నీ మహిళలపైనే ఫోకస్ పెడుతున్నారు. దీంతో పురుషులు వేసెక్టమీ కోసం ముందకు రావడం లేదు.
2019 -2021 మధ్య జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలో పెళ్లయిన 99 శాతం మందికి కుటుంబ నియత్రణ పద్ధతులు తెలిసిన వారే. కండోమ్స్, పిల్స్ గురించి 15 నుంచి 49 ఏళ్ల వయసువారికి తెలుసు. దీంతో కండోమ్ వినియోగం ఈ వ్యవధిలో 47.8 శాతం నుంచి 56.5 శాతానికి పెరిగింది.
దేశంలో కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగింది. కానీ కుటుంబ నియంత్రణ పద్ధతులు మాత్రం ఎక్కువగా పాటించేంది ఆడవాళ్లు మాత్రమే. కుటుంబ నియంత్రణ కోసం ఆడవాళ్లు అబార్షన్ చేయించుకుంటున్నారు. దీని వల్ల వారిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పురుషుల్లో వేసెక్టమీ చాలా సులభంగా ఉంటుంది. కానీ దీని కోసం ఎవరూ ముందుకు రావడం లేదు.
దేశవ్యాప్తంగా ఈ సంఖ్య చూస్తే.. దేశంలో పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వేసెక్టమీ)లు చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. చత్తీస్ ఘడ్ రాష్ట్రం మొదటి స్తానంలో ఉంది. గత ఏడాది రాష్ట్రంలో మొత్తం 3600 వెసేక్టమీ సర్జరీలు జరిగాయి. మరోవైపు వ్యక్తిగత జాబితాలో అత్యధిక సర్జరీలు చేసినందుకు హన్మకొండ డిప్యూటీ డీఎంహెచ్.వో డాక్టర్ యాకూబ్ పాషాకు కేంద్రం ప్రత్యేక అవార్డు ఇవ్వడం విశేషం. ఆయన తన 22 ఏళ్ల సర్వీసులో 40వేలకు పైగా సర్జరీలు చేశారు.
తాజాగా ఢిల్లీలో నిర్వహించిన జాతీయ ఫ్యామిలీ ప్లానింగ్ సమ్మిట్-2022లో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు దీనిపై హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని.. డాక్టర్ యాకూబ్ పాషాను ప్రత్యేకంగా అభినందించారు.
మొత్తంగా దేశవ్యాప్తంగా మన తెలంగాణ మగాళ్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు చేయించుకోవడంలో దేశంలోనే 2వ స్తానంలో ఉండడం విశేషంగా చెప్పవచ్చు. మనకంటే చత్తీస్ ఘడ్ వాసులు మాత్రమే ముందున్నారు. ఇక మిగతా రాష్ట్రాల వారు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు.