ఈ నెల (జులై) 21 బక్రీద్ పండుగ ను ముస్లిమ్ సోదరులు జరుపుకోనున్నారు. దీనితో ఈ బక్రీద్ (ఈద్ అల్ అదా) పండుగ కోసం కేరళ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించింది. కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకి దారితీస్తుంది. ఆదివారం నుంచినే పినరాయి విజయన్ ప్రభుత్వం కేరళ లో కరోనా నియమాలు సడలించింది. ఆది, సోమ, మంగళ వారాలు అన్ని షాపులనూ తెరుచుకోవచ్చని ఎలాంటి, ఆంక్షలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం బక్రీద్ జరపుకోనున్నారు ముస్లింలు.
వారి కోసం ప్రభుత్వం ఆంక్షలన్నింటినీ ఎత్తి వేసింది. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ అంశంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని, ఆంక్షలను ఎత్తివేయవద్దని ఐఎంఏ కోరింది. లేదంటే ఈ అంశంపై తాము సుప్రీంను ఆశ్రయిస్తామని కూడా ప్రకటించింది. అయితే కేరళ ప్రభుత్వం ఈ అంశంపై ఏ మాత్రం పై నోరు విప్పడం లేదు. బక్రీద్ కోసం మూడ్రోజుల పాటు కరోనా నిబంధనలను సడలించడం ఏంటంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా కరోనా రూల్స్‌ను సడలించడంపై సీరియస్ అయ్యింది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న తరుణంలో కరోనా రూల్స్‌ను ఎలా సడలిస్తారంటూ ఐఎంఏ కేరళ సర్కారును ప్రశ్నించింది. ఒకవైపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో కావడ్ యాత్ర వివాదాస్పదం అయ్యింది. సుప్రీం కోర్టు జోక్యంతో ఆ యాత్రకు యూపీ ప్రభుత్వం కూడా పర్మిషన్ ను రద్దు చేసుకున్నట్టుగా ఉంది. ఇంతలోనే కేరళ బక్రీద్ రిలాక్సేషన్ ఇవ్వడం పెద్ద దుమారం రేగింది.
కేరళ ప్రభుత్వం తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే సుప్రీం కోర్డుకు వెళ్తామని ఐఎంఏ హెచ్చరించింది. కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న టైమ్‌లో కొవిడ్ రూల్స్‌ను సడలించాలన్న సర్కారు నిర్ణయం దురదృష్టకరమని మండిపడింది. పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తమ సంప్రదాయ, ప్రముఖ పండుగలు, తీర్థ యాత్రలను నిలిపివేశాయని పేర్కొంది. ఇలాంటి సమయంలో అక్షరాస్యతలో ముందున్న కేరళ తీసుకున్న నిర్ణయం సరికాదని ఐఎంఏ ఓ ప్రకటనలో వివరించింది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా పరిస్థితిని నియంత్రించడానికి అదనపు ఆంక్షలను పెట్టుకోవాల్సిన కేరళ ప్రభుత్వం, ఇప్పుడు పండగ సంబరాలు అంటూ పగ్గాలను వదలడం క్షమార్హమైన చర్యలా కనిపించడం లేదు. ఇప్పటికే పక్క రాష్ట్రాలు కేరళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కేరళ నుంచి వచ్చే వారిపై కన్నేసి ఉంచాలని ఇది వరకే కర్ణాటక ప్రకటించింది. ఇప్పుడు విజయన్ ప్రభుత్వ తీరు, పని మీదో, మరో దాని కోసమే రాష్ట్రం దాటాలనే కేరళ ప్రజలపై ఇతర రాష్ట్రాలు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలను వేగంగా పెరిగేలా చేసింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. బక్రీద్ కోసం మూడు రోజుల పాటు కరోనా నిబంధనలను సడలించడం ఏంటంటూ కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం కూడా కేరళనే కావడం గమనార్హం. అక్కడ పాజిటివిటీ రేటు ఏకంగా 15 శాతం ఉందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గత ఇరవై నాలుగు గంటల్లోనే అక్కడ 13 వేలకు పైగా కేసులు వచ్చాయి. ఇక యాక్టివ్ కరోనా కేసుల సంఖ్యలో కూడా కేరళ టాప్ లో ఉంది. 1.25 లక్షలకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి కేరళలో. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బక్రీద్ కు అంటూ మినహాయింపులు ఇవ్వడం ఏమిటో కేరళ సర్కార్ ఒకసారి ఆలోచించుకోవాలి.