టీఆర్ఎస్ ఖాతాలో మ‌రో మూడు విజ‌యాలు

Update: 2017-03-10 14:16 GMT
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగుతోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. ఇందులో ముగ్గురు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మైనంప‌ల్లి హనుమంతరావు - ఎలిమినేటి కృష్ణారెడ్డి - వి.గంగాధర్‌ గౌడ్‌ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరికి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తమని పేర్కొన్నారు.  అనంత‌రం  హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ ఎస్ పార్టీకి తిరుగులేదని అన్నారు. టీఆర్‌ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు హన్మంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఉనికిని ప్రశ్నించే శక్తి ఎవరికీ లేదన్నారు. 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని నాయిని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటున్నామని నాయిని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నరని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీఆర్‌ఎస్‌కు 101 నుంచి 106 సీట్లు వస్తాయ‌ని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని.. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటరిస్తామని నాయిని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News