కాలిఫోర్నియాలో కరోనా కలకలం .. 30 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు !

Update: 2021-01-21 12:30 GMT
కరోనా మహమ్మారి ప్రపంచంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే పలు దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కరోనా‌ బీభత్సం సృష్టిస్తోంది. ఇక్కడ పాజిటివ్‌ కేసులు 30 లక్షల మార్కుని దాటేశాయి. అమెరికాలో 30 లక్షలకుపైగా కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. 4 కోట్ల జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో డిసెంబరు 24 వరకు 20 లక్షల కేసులే ఉన్నాయి. నెల రోజుల్లోనే కేసులు విపరీతంగా పెరగడంతో ఆ సంఖ్య 30 లక్షలు దాటింది.

30 రాష్ట్రాల్లో వారం రోజుల్లోనే మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అమెరికాలో మరణాల సంఖ్య 4 లక్షలు దాటేసింది. అమెరికాలో ఇప్పటి ఇవరకు 2.4 కోట్ల కేసులు బయటపడ్డాయి. ఇక ఈశాన్య చైనాలో కరోనా వైరస్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇలా ఆ దేశంలో పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్‌ ఇప్పుడిప్పుడు అందుబాటులోకి వస్తుండటంతో కేసుల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఒక వైపు కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో కట్టడి రాకముందే మరోవైపు యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది.  కొత్త రకం కరోనా వైరస్‌తో పాటు మొత్తం నాలుగు రకాల వైరస్‌లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే .. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 15,223 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 19,965 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,10,883కు చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 151 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

దీంతో మృతుల సంఖ్య 1,52,869కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,65,706 మంది కోలుకున్నారు. 1,92,308 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 8,06,484 మందికి వ్యాక్సిన్లు వేశారు.
Tags:    

Similar News