కొద్దికాలం కిందట వచ్చిన ఓ తెలుగు సినిమాలోని కామెడీ గుర్తుండే ఉంటుంది. ఓ వ్యక్తి తను పడుకునే బొంతలో లక్షల కొద్ది డబ్బులు దాచుకుంటాడు. అయితే, ఓ రోజు ఆయనకు తెలియకుండా భార్య అమ్మేస్తుంది. దాంతో..అతను ఆ బొంతను తిరిగి పొందేందుకు తెగ ప్రయత్నిస్తుంటాడు. అయితే, తాజాగా అమెరికాలో ఓ చిత్రమైన ఘటన జరిగింది. సరిగ్గా దీనికి రివర్స్. ఓ వ్యక్తికి సోఫాలో ఎవరో దాచుకున్న దాదాపు 30లక్షలు దొరికితే...క్షేమంగా వారికి తిరిగి అప్పగించాడు!
అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన హోవార్డ్ కిర్బీ అనే వ్యక్తి ఓ సోఫాను సెకండ్ హ్యాండ్ దుకాణంలో కొనుగోలు చేశాడు. కొద్దికాలం వాడిన తర్వాత మరమ్మతులు చేయిస్తుండగా... హోవార్డ్‌కు డబ్బుల కట్టలు కనిపించాయి. సోఫా లోపల మొత్తం 43 వేల డాలర్లు (సుమారు రూ. 30 లక్షల 60 వేలు)దొరకడంతో హోవార్డ్ ఒక్కసారిగా షాకయ్యాడు. సోఫా ఇప్పుడు ఆయనదే కాబట్టి డబ్బులూ ఆయనవే అవుతాయి. కానీ ఆయనేం చేశాడో తెలుసా? ఆ డబ్బుల ఓనర్ కోసం వెతికాడు.
తనకు సోఫా అమ్మిన దుకాణం ద్వారా అసలు ఆ సోఫా ఎవరిదో కనుక్కొని వారింటికి వెళ్లాడు. కిమ్ ఫాత్ మహిళ అసలు విషయం చెప్పింది. ``ఆ సోఫా ఇటీవల అనారోగ్యంతో మరణించిన మా తాతది. తాతపోయాడు..సోఫా పాతది అయిపోయింది కాబట్టి తగలబెడదాం అని అనుకున్నాం. అయితే సోఫా దుకాణం వాళ్లు తీసుకుంటామనడంతో వాళ్లకు ఇచ్చేశాం. తాత అంత డబ్బును సోఫాలో దాచి ఉంచాడన్న విషయం మాకు తెలియదు` అని నిజాయితీగా చెప్పింది. అయినా హోవార్డ్ ఊరుకోలేదు. తనకు దొరికిన డబ్బు మొత్తాన్ని హోవార్డ్ కిమ్ ఫాత్‌కు ఇచ్చేశాడు. రోడ్డుమీద పది రూపాయల నోటు దొరికితేనే నిమిషం ఆలస్యం కాకుండా తీసి జేబులో పెట్టుకునే రోజుల్లో హోవార్డ్ నిజంగా గ్రేట్ కదా?