దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. దిక్కుమాలిన వైరస్ కేసులు తెలంగాణలో తక్కువన్నట్లుగా కనిపిస్తాయి. దీనికి కారణం తెలంగాణ రాష్ట్రంలో నిర్దారణ పరీక్షలు తక్కువగా చేయటమే కారణమన్న వాదనను పలువురు వినిపిస్తుంటారు. అయితే.. ఈ వాదనలో పస లేదని చెప్పాలి. ఎందుకంటే.. కేసుల్ని ఎవరూ దాచలేరు. అలానే వైరస్ ను అడ్డుకోలేరు. అలాంటప్పుడు పరీక్షలు చేసినా.. చేయకున్నా వచ్చే కేసులు రాకుండా మానవు. ఈ వాదనకు బలం చేకూరే పరిణామం తాజాగా చోటు చేసుకుంది.
ఏప్రిల్ చివరి వారంలో తక్కువగా నమోదైన కేసులకు భిన్నంగా మే మొదటి వారంలో సీన్ కాస్త మారిందన్నట్లుగా కేసు నమోదు ఉంది. మహారాష్ట్ర.. గుజరాత్.. మధ్యప్రదేశ్.. తమిళనాడు.. ఆ మాటకువస్తే ఏపీతో పోల్చినా తెలంగాణలో పరిస్థితి అదుపులో ఉందన్న మాట పలువురి నోట వస్తోంది. ఇలాంటి వాదనకు చెక్ చెప్పే పరిణామం తాజాగా చోటుచేసుకుంది. శనివారం ఒక్కరోజులో తెలంగాణ వ్యాప్తంగా 31 పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో 30 కేసులు హైదరాబాద్ మహానగరంలో నమోదుకావటం గమనార్హం.
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కేసులు నమోదు కావటం లేదు. కొన్ని జిల్లాల్లో అయితే.. పద్నాలుగు రోజులకు పైనే కొత్త కేసులు రాలేదు. దీనికి తోడు.. రోజులు గడుస్తున్న కొద్దీ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చాలా జిల్లాల్లో పరిస్థితి మెరుగవుతున్న పరిస్థితి. ఆ మధ్యన పెద్ద ఎత్తున కేసులు నమోదైన సూర్యాపేట మొదలు కొని.. మొదట్లో మర్కజ్ వేళ కరీంనగర్ లోనూ పరిస్థితి కంట్రోల్ లోనే ఉంది. దీంతో.. ఊపిరి పీల్చుకుంటున్న కేసీఆర్ సర్కారుకు హైదరాబాద్ తోనే షాక్ ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వాదనకు బలం చేకూరేలా తాజా పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. ఒక్కరోజులో గ్రేటర్ పరిధిలో 30 కేసులు నమోదు కావటంతో.. అధికారులు ఉలిక్కిపడే పరిస్థితి. కాకుంటే.. ఊరట కలిగించే అంశం ఏమంటే.. ఇప్పటికే వైద్యుల పర్యవేక్షణలోనూ.. అధికారులు గుర్తించిన వారే కావటం కొంతలో కొంత నయమని చెప్పాలి. ఏమైనా.. రానున్న రోజుల్లో హైదరాబాద్ లో కొత్త కేసులు నమోదు కాకుండా చూడటం అనేది ప్రభుత్వానికి పెను సవాలుగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ మొత్తం ఒక ఎత్తు అయితే.. హైదరాబాద్ మరో ఎత్తు అవుతుందని.. ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.