ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్ భారత్ లోనూ వేగంగా విజృంభిస్తోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1071కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో 29మంది మరణించగా 942మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 100మంది కరోనా నుండి కోలుకున్నారని తెలిపింది. ఇకపోతే ఏపీలో కూడా ఈ కరోనా క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఇప్పటివరకు 23 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.అలాగే ఇప్పటివరకు ఇద్దరు కరోనా నుండి కోలుకొని హాస్పిటల్ నుండి డీఛార్జ్ అయ్యారు.
ఇకపోతే, ఆదివారం మధ్యాహ్నం ఒకేసారి 30 మంది కరోనా అనుమానితులను అయిదు 108 అంబులెన్సుల్లో గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. గుంటూరుజిల్లా మాచర్ల పట్టణం నుంచి గుంటూరు జిజిహెచ్‌కు వీరిని పరీక్షల నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా, గుంటూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇచ్చిన విందులో పాల్గొన్నవారిలో విదేశాల నుంచి వచ్చినవారుండగా, మరికొందరు ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారున్నారు. వారికి అన్ని వైద్యపరీక్షలు చేసిన తర్వాతపూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు తెలిపారు. ఈ కరోనాని అరికట్టడానికి ..ప్రభుత్వం ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీనితో ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది.