107 మంది మ‌ర్డ‌ర‌ర్లు..322 మంది కోటీశ్వ‌రులు

Update: 2017-03-13 04:20 GMT
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్త‌రప్రదేశ్ తాజా ఎన్నిక‌ల ఫలితాల‌తో అనూహ్య రీతిలో వార్త‌ల్లోకి ఎక్కుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన 403 మంది నూతన ఎమ్మెల్యేల్లో 322 మంది కోటీశ్వరులు. అంతేకాదు 43 మందిపై నేరాభియోగాలు నమోదు కాగా 107 మందిపై హత్యానేరం, మహిళలపై దాడులతోపాటు తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయని నేషనల్ ఎలక్షన్ వాచ్ లిపింది. వారిలో మౌ స్థానం నుంచి బీఎస్పీ తరఫున ఎన్నికైన ముఖ్తార్ అన్సారీపై ఐదు హత్యాహత్యా కేసులు సహా 16 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4,853 మంది అభ్యర్థుల్లో 860 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. గుండా జిల్లాలోని కాలనెల్‌ గంజ్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే అజయ్ ప్రతాప్ సింగ్ ఆస్తులు రూ.49 కోట్లు. రైతునని అఫిడవిట్‌ లో పేర్కొన్న అజయ్ వద్ద 60 కిలోల బంగారం - ఏడు వాహనాలు - ఆరు తుపాకులున్నాయి. వాటిలో మూడేసి చొప్పున తమ భార్యాభర్తల పేర్లపై ఉన్నాయి. ఎన్నికల బరిలో 1455 మల్టీ మిలియనీర్లు నిలిచారు. 479 మంది మహిళలు పోటీ చేయగా కేవలం 40 మంది మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. పోటీ చేసిన వారిలో 290 మంది (72%) మంది నూతన ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ కోర్సులు చదివిన వారు ఉన్నారు.

మ‌రోవైపు ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ సాధించిన ఘన విజయం అయోధ్యలో రామందిర నిర్మాణానికి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ ఎస్‌ ఎస్) సిద్ధాంతకర్త ఎంజి వైద్య అభివర్ణించారు. బీజేపీ మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రస్తావన ఉందని, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు దానికి ఆమోద్రముద్రగా భావించవచ్చని వైద్య అన్నారు. వివాదాస్పద స్థలంలో మందిరం ఉండేదని, తవ్వకాల్లో మందిరం అవశేషాలు సైతం బయల్పడ్డాయని అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా పేర్కొందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు గనుక ఈ వివాదాన్ని పరిష్కరించని పక్షంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆయన అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News