టీవీలో.. జెమినీ ఛానల్‌ రాదా..?

Update: 2015-06-08 09:03 GMT
సుపరిచితమైన జెమినీ టీవీ ప్రసారాలు ఆగిపోతాయా? అంటే.. ఆ అవకాశాలు భారీగా ఉన్నాయని చెబుతున్నారు. సన్‌ గ్రూప్‌కి చెందిన 33 ఛానళ్ల ప్రసారాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఇచ్చే విషయంలో నో చెప్పటంతో సన్‌గ్రూప్‌కి చెందిన టీవీ ఛానళ్ల ప్రసారాల పరిస్థితి సందిగ్థంలో పడ్డాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ.. కోర్టు స్టే ఇస్తే తప్పించి.. సన్‌గ్రూప్‌కి చెందిన ఛానళ్లు ప్రసారం అయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

ఒకవేళ కోర్టు సైతం సానుకూలంగా స్పందించని పక్షంలో మొత్తం 33 ఛానళ్లు మూతపడటం ఖాయం అంటున్నారు. అదే జరిగితే.. ప్రజాదరణ పొందిన పలు సన్‌ నెట్‌వర్క్‌లోని ఛానళ్లు టీవీలో అదృశ్యం కావటం ఖాయం. తెలుగు వరకు చూస్తే.. జెమినీ పేరిట పలు ఛానళ్లు ఉన్నాయి. జెమినీ టీవీ.. జెమినీ హెచ్‌డీ టీవీ.. జెమినీ మూవీస్‌.. జెమినీ మ్యూజిక్‌.. జెమినీ న్యూస్‌.. జెమినీ కామెడీ.. ఖుషీ టీవీ.. జెమినీ యాక్షన్‌.. జెమినీ లైఫ్‌ ఉన్నాయి. తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లోనూ సన్‌ నెట్‌వర్క్‌కి పలు ఛానళ్లు ఉన్నాయి.

Tags:    

Similar News